Home న్యూస్ సీటిమార్ టోటల్ బిజినెస్…థియేటర్స్ కౌంట్….బిజినెస్ తగ్గింది!

సీటిమార్ టోటల్ బిజినెస్…థియేటర్స్ కౌంట్….బిజినెస్ తగ్గింది!

0

యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరచగా గోపీచంద్ ఆశలు అన్నీ కూడా ఇప్పుడు సీటిమార్ మీదే పెట్టుకున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కి సంపత్ నంది డైరెక్ట్ చేస్తుండ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సెకెండ్ పాండమిక్ తర్వాత టాలీవుడ్ నుండి హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమా గా నిలిచింది సీటిమార్ సినిమా…

కానీ రీసెంట్ మూవీస్ బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మెన్స్ వలన ఈ సినిమా బిజినెస్ లో మార్పులు జరిగాయి. ముందు 15 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సినిమా సొంతం చేసుకున్నా కానీ రీసెంట్ మూవీస్ పెర్ఫార్మెన్స్ వలన బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు సినిమా రేట్లు తగ్గించాల్సిందిగా కోరారు…

దాంతో మేకర్స్ సినిమా బిజినెస్ ను తగ్గించి ఇప్పుడు సినిమాను నైజాంలో 4 కోట్లు సీడెడ్ లో 2 కోట్లు టోటల్ ఆంధ్రాలో 5 కోట్ల రేంజ్ రేటుకి అమ్మగా టోటల్ తెలుగు రాష్ట్రాలలో సినిమా బిజినెస్ 11 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక మిగిలిన చోట్ల మరో 50 లక్షల బిజినెస్ చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా…

11.5 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ కోసం 12 కోట్ల మేర షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా నైజాంలో 214 థియేటర్స్ లో రిలీజ్ కానుండగా టోటల్ ఆంధ్రాలో 350 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ఇప్పుడు 565 థియేటర్స్ లో రిలీజ్ కానుండగా…

ఫైనల్ లెక్క 600 రేంజ్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ థియేటర్స్ కౌంట్ 670 వరకు ఉంటుందని అంచనా… సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కొంచం కష్టంగానే కనిపిస్తుంది కానీ సినిమా కి టాక్ పాజిటివ్ గా ఉంటే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంపాక్ట్ చూపే అవకాశం ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here