Home న్యూస్ టాలీవుడ్ మీడియం రేంజ్ మూవీస్ టాప్ 10 ఫస్ట్ డే కలెక్షన్స్!!

టాలీవుడ్ మీడియం రేంజ్ మూవీస్ టాప్ 10 ఫస్ట్ డే కలెక్షన్స్!!

0

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మొదటి రోజు అద్బుతమైన కలెక్షన్స్ తో దుమ్ము లేపిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ లో 50% ఆక్యుపెన్సీ అండ్ లో టికెట్ రేట్లు ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ డే సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోసి నాగ చైతన్య కెరీర్ లోనే నంబర్ 1 షేర్ వసూల్ చేసిన సినిమాగా నిలిచింది.

దాంతో టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ పరంగా చూసుకుంటే ఇప్పుడు లవ్ స్టొరీ సినిమా సాధించిన ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ ప్లేస్ లో నిలిచింది అన్నది ఆసక్తిగా మారింది. ఒకసారి టాప్ 10 మూవీస్ ని గమనిస్తే…. 10 వ ప్లేస్ లో విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమా…

5.81 కోట్ల షేర్ ని అందుకోగా, 9 వ ప్లేస్ లో వరుణ్ తేజ్ గద్దల కొండ గణేష్ సినిమా 5.83 కోట్ల షేర్ ని సాధించింది. ఇక 8వ ప్లేస్ లో నితిన్ భీష్మ సినిమా 6.42 కోట్ల షేర్ ని అందుకోగా… 7 వ ప్లేస్ లో నాగ చైతన్య శైలజా రెడ్డి అల్లుడు 6.93 కోట్ల షేర్ ని అందుకుంది.

ఇక ఇప్పుడు 6 వ ప్లేస్ లో నాగ చైతన్య లవ్ స్టొరీ సినిమా 6.94 కోట్ల షేర్ తో నిలిచింది. ఇక టాప్ 5 ప్లేస్ లో విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమా 7.5 కోట్ల షేర్ ని అందుకోగా, 4 వ ప్లేస్ లో నాని MCA సినిమా 7.57 కోట్ల షేర్ ని అందుకుంది… ఇక 3 వ ప్లేస్ లో అఖిల్ నటించిన అఖిల్ 7.6 కోట్ల షేర్ ని అందుకోగా…

2 వ ప్లేస్ లో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా 7.73 కోట్ల షేర్ ని అందుకుని దుమ్ము దుమారం చేస్తూ టైర్ హీరోల పరంగా టాప్ ప్లేస్ ని అందుకుంది. ఇక మీడియం రేంజ్ మూవీస్ పరంగా ఉప్పెన సినిమా 9.35 కోట్ల షేర్ తో టాప్ ప్లేస్ లో ఉంది. లవ్ స్టొరీ కి పరిస్థితులు బాగుంటే 10 కోట్ల షేర్ ని అందుకుని సంచలనం సృష్టించేది కానీ మిస్ అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here