యంగ్ హీరో నాగ శౌర్య మరియు రితు వర్మ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వరుడు కావలెను బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి టాక్ డీసెంట్ గానే వచ్చినా కానీ కలెక్షన్స్ మాత్రం అనుకున్న రేంజ్ లో అయితే సొంతం చేసుకోలేక పోయింది ఈ సినిమా. సినిమా ఓవరాల్ బిజినెస్ ఎక్కువ జరగడంతో ఆ రేంజ్ వసూళ్లు రాక బాక్స్ ఆఫీస్ దగ్గర దెబ్బ పడింది.
సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కాకుండా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోయినట్లు తెలుస్తుంది, శాటిలైట్ రైట్స్ కి సుమారు 2.7 కోట్ల రేంజ్ లో సొంతం అవ్వగా రీసెంట్ గా డిజిటల్ రైట్స్ కూడా సోల్డ్ ఔట్ అయ్యాయి. ఓవరాల్ గా డిజిటల్ రైట్స్ కి గాను…
రేటు 2 కోట్ల దాకా సొంతం అవ్వగా డిజిటల్ రైట్స్ ను జీ నెట్ వర్క్ వాళ్ళు సొంతం చేసుకుందని అంటున్నారు. బాక్స్ ఆఫీస్ ఫేట్ ఎలా ఉన్నప్పటికీ డిజిటల్ రేటు శాటిలైట్ రైట్స్ రేటు బాగానే గిట్టుబాటు అయ్యింది ఈ సినిమా. బాక్స్ ఆఫీస్ దగ్గర పోటి లేకుండా చూసుకుంటే కొంచం రిజల్ట్ ఇంకా బెటర్ గా ఉండేది..