హృదయ కాలేయం సినిమాతో హీరోగా అడుగు పెట్టి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంపూ హీరోగా తర్వాత వచ్చిన సినిమాలలో ఒక్క కొబ్బరి మట్ట సినిమా ఆకట్టుకుంది, ఒక స్పూఫ్ సినిమా హిట్ అవ్వడంతో సంపూ అలాంటి కాన్సెప్ట్ తోనే సినిమాలను ఎంచుకుంటూ ఉండగా ఆ కోవలోకే వచ్చిన లేటెస్ట్ మూవీ క్యాలీ ఫ్లవర్…. మరి ఈ సినిమాతో సంపూ మరో హిట్ ని అందుకున్నాడ లేక ఫ్లాఫ్స్ లిస్టులో సినిమా చేరిందా తెలుసుకుందాం పదండీ..
కథ పాయింట్ కి వస్తే…విదేశీయుడు అయిన సంపూ ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మాయిలు ఎంతో గొప్ప వారని తెలుసుకుని ఇక్కడ అమ్మాయినే ఏరికోరి పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవుతారు…సంపూ మనవడు అయిన మరో సంపూ తాత అడుగు జాడల్లో నడుస్తూ పెళ్లి త్వరగా వద్దని…
35 ఏళ్ళు పైబడ్డ తర్వాతే చేసుకుంటానని చెప్పగా అనుకోకుండా సంపూని ఓ ముగ్గురు అమ్మాయిలు మానభంగం చేస్తారు…ఇక సంపూ వాళ్ళ పై ఎలా పోరాడాడు అన్నది సినిమా కథ పాయింట్… అత్యంత పేలవమైన కథ పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా కథ పరంగా పూర్తిగా నిరాశ పరిచింది అని చెప్పాలి..
అసలు కథలో పాయింటే లేదు, ఇక కామెడీ అక్కడక్కడా ఫోర్స్ గా అనిపించింది, ఎక్కడో కొన్ని చోట్ల నవ్వు వచ్చినా సినిమా మేజర్ పార్ట్ మొత్తం ఆడియన్స్ పేషన్స్ కి పరీక్షగా నిలుస్తుంది అని చెప్పాలి. దాంతో ఎప్పుడెప్పుడు సినిమా అయిపోతుందా అని ఎదురు చూపులు చూస్తారు ఆడియన్స్… ఫస్టాఫ్ ఎలాగోలా గడిచినా సెకెండ్ ఆఫ్ కూడా పేలవంగా ఉందని చెప్పాలి. ఎదో స్పూఫ్స్ ని ఇష్టపడే వారు…
సిల్లీ కామెడీ సీన్స్ ని ఇష్టపడే వాళ్ళకి సినిమా అతి కష్టం మీద పర్వాలేదు అనిపించవచ్చు కానీ రెగ్యులర్ ఆడియన్స్ కి కూడా సినిమా రుచించడం కష్టమే. సంపూ ఉన్నంతలో పర్వాలేదు అనిపించినా నవ్వించడానికి ట్రై చేసినా కానీ ఆడియన్స్ కి అది కనెక్ట్ కాలేదు అనే చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.