Home న్యూస్ ఇదేం సినిమా రా బాబు….తలలు పట్టుకుంటున్నారుగా!

ఇదేం సినిమా రా బాబు….తలలు పట్టుకుంటున్నారుగా!

0

బాలీవుడ్ వాళ్ళు అప్పుడప్పుడు మంచి సినిమాలు చేస్తారు కానీ కమర్షియల్ మూవీస్ పరంగా మాస్ మూవీస్ పరంగా సౌత్ తో పోల్చితే నాసిరకం సినిమాలు ఎక్కువగా చేసేది వాళ్ళే అని చెప్పాలి. ముఖ్యంగా మాస్ మూవీస్ పరంగా బాలీవుడ్ లో వచ్చిన రీసెంట్ మూవీస్ లో బెస్ట్ అనిపించుకున్న సినిమాలు ఒకటి రెండు తప్ప ఏమి లేవు, కానీ అక్కడ ఆడియన్స్ కు మాస్ మూవీస్ అంటే ఇష్టం అని ఎలా పడితే అలా…

మాస్ మూవీస్ అంటూ సినిమాలను వదులుతూ ఉంటారు, లేటెస్ట్ గా ట్రైలర్ చూసినప్పడే ఇదేం రొట్ట సినిమా రా బాబు అనిపించిన సినిమా సత్యమేవ జయతే 2… కండల వీరుడు జాన్ అబ్రహం ఏకంగా మూడు డిఫెరెంట్ రోల్స్ లో కనిపించిన ఈ సినిమా ఇది వరకు వచ్చిన సత్యమేవ జయతే సినిమాకి సీక్వెల్…

మొదటి పార్ట్ అప్పుడు హాలిడేస్ కలిసి రావడం సాంగ్స్ బాగుంటం తో బాగానే ఆడిందని సీక్వెల్ అనౌన్స్ చేసి రీసెంట్ గా సినిమాను ఆడియన్స్ ముందుకు వదలగా థియేటర్స్ లో ఆహాకారాలు వినిపిస్తున్నాయి. ఒక రౌడీ, ఒక పోలిస్ మరియు ఒక పొలిటికల్ లీడర్..

ఇలా ఈ ముగ్గురు కలిస్తే సమాజం ఎలా ఉంటుంది అన్నట్లు తెరకెక్కించిన ఈ సినిమాలో మూడు రోల్స్ ని జాన్ అబ్రహమే చేయగా యాక్షన్ పార్ట్ మరీ ఓవర్ గా ఉండగా అసలు కథ ఏమాత్రం ఆకట్టుకోలేదని చెప్పొచ్చు. ఫస్ట్ సీన్ నుండే సినిమా ఎటు నుండి ఏటో పోతూ ఎప్పుడు అయిపోతుందిరా బాబు అని జనాలు ఎదురు చూసేలా చేసింది అని చెప్పాలి.

లౌడ్ యాక్షన్ సీన్స్, ఓవర్ గా అనిపించిన డైలాగ్స్ అండ్ మెలో డ్రామా అసలు ఏ దశలో కూడా ఆకట్టుకోలేదు. దాంతో సినిమా చూసిన బాలీవుడ్ జనాలు ఇదేం సినిమా రా బాబు అంటూ తలలు పట్టుకు కూర్చున్నారు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ టాక్ తో ఎలాంటి వసూళ్ళని సాధిస్తుందో అనేది ఆసక్తిగా మారింది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here