నాగశౌర్య నటించిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా లక్ష్య బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అండర్ పెర్ఫార్మ్ చేసింది అని చెప్పాలి. అన్ని ఏరియాల్లోనే మొదటి రోజు షేర్స్ బయటికి రాలేదు కానీ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు 75 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. టోటల్ వరల్డ్ వైడ్ గా 85 లక్షల రేంజ్ లో వసూళ్ళని సొంతం చేసుకున్న తర్వాత…
రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా అఖండ మాస్ యుఫోరియాని ఈ సినిమా తట్టుకోలేక పోతుంది అనే చెప్పాలి. మాస్ సెంటర్స్ నుండి క్లాస్ సెంటర్స్ వరకు అన్ని చోట్లా దుమ్ము లేపగా ఆ ఇంపాక్ట్ లక్ష్య పై కూడా క్లియర్ గా కనిపించగా ఓవరాల్ గా రెండో రోజు….
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 30% కి పైగానే డ్రాప్ అవ్వగా మొత్తం మీద సినిమా రెండో రోజు 50 లక్షల నుండి 60 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని అందుకునేలా ఉందని చెప్పాలి. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కొంచం ఎక్కువకి వెళ్ళొచ్చు కానీ బిజినెస్ ను అందుకోవాలి అంటే ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఉంది.