బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ సినిమా రీసెంట్ గా 1100 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా కి ప్రీమియర్స్ తోనే ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సాధించగా ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో హాల్ఫ్ మిలియన్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా తెలుగు రాష్ట్రాలలో మట్టుకు సినిమా…
బుకింగ్స్ మూడు రోజుల ముందే మొదలు అయినా కానీ ఏమాత్రం ఆకట్టుకునే బిజినెస్ జరగలేదు సినిమాకి, దాంతో మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి రిలీజ్ అయిన సినిమాకి పాజిటివ్ టాక్ సొంతం అవ్వడంతో ఆఫ్ లైన్ లో కౌంటర్ దగ్గర టికెట్ సేల్స్…
బాగానే ఉన్నాయి కానీ రీసెంట్ మూవీస్ తో పోల్చితే టికెట్ రేట్స్ ఇప్పటికీ హై గానే ఉన్నాయి అని చెప్పాలి ఈ సినిమాకి. దాంతో ఆ ఇంపాక్ట్ కూడా ఉండగా మార్నింగ్ షోలు జస్ట్ యావరేజ్ అనిపించేలా ఉన్నప్పటికీ మ్యాట్నీ షోల నుండి సినిమా జోరు అందుకోవడం మొదలు పెట్టగా తెలుగు రాష్ట్రాలలో…
ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం కి మంచి ట్రెండ్ నే చూపిస్తూ దూసుకు పోతుంది. ముందు బుకింగ్స్ చూసి 2.5 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకునేలా అనిపించినా కానీ ఇప్పుడు సినిమా 3 కోట్లకు పైగా షేర్ ని తెలుగు రాష్ట్రాలలో అందుకోవచ్చు. అన్ని చోట్లా నైట్ షోలకు మంచి జోరు చూపిస్తున్న అంటే సుందరానికీ మొత్తం మీద ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో….
3.5 కోట్ల దాకా ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అంచనాలను మించిపోయేలా కనుక ఉంటె 4 కోట్ల దాకా వెళ్ళే ఔట్ రైట్ చాన్స్ ఉంటుంది అని చెప్పాలి. మరి సినిమా మొత్తం మీద మొదటి రోజు ఈ రేంజ్ దాకా కలెక్షన్స్ ని అందుకుంటుందో లేదో చూడాలి ఇక.