బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ ది వారియర్ మొదటి రోజు అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా హైర్స్ హెల్ప్ తో ఓవరాల్ గా మంచి నంబర్స్ నే నమోదు చేసింది. ఇక రెండో రోజు లో అడుగు పెట్టిన ఈ సినిమా మరో నార్మల్ డే నే అవ్వడం, టికెట్ హైక్స్ ఎక్కువగా ఉందటం, టాక్ మిక్సుడ్ గా ఉండటం లాంటి ప్రతికూలతల వలన…
డ్రాప్స్ ను ఎక్కువగానే సొంతం చేసుకుంది. తొలిరోజే ఆన్ లైన్ బుకింగ్స్ కన్నా కౌంటర్ బుకింగ్స్ ను ఎక్కువగా సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో రోజు ఆన్ లైన్ బుకింగ్స్ లో ఏమాత్రం హోల్డ్ ని చూపించలేక పోయింది. టికెట్ హైక్స్ ఉండటం…. బుకింగ్స్ చేసుకునే టైం లో…
చార్జులు కూడా పే చేయాల్సి ఉంటుంది కాబట్టి దాని కన్నా ఆఫ్ లైన్ బుకింగ్స్ బెటర్ అనుకుంటున్నారో ఏమో ఆన్ లైన్ బుకింగ్స్ ఏమాత్రం కనిపించడం లేదు, దాంతో మరో సారి ఆఫ్ లైన్ బుకింగ్స్ పైనే డిపెండ్ అయిన సినిమా కొన్ని మాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించే విధంగా…
హోల్డ్ చేయగా ట్రాక్ చేసిన కొన్ని సెంటర్స్ ప్రకారం డ్రాప్స్ అయితే 50-55% రేంజ్ లో కనిపించాయి. ఈ లెక్కన రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొదటి రోజు వర్త్ షేర్ దృశ్యా 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని రెండో రోజు అందుకోవచ్చు. కంప్లీట్ గా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 2.7 కోట్ల రేంజ్ దాకా వెళ్ళొచ్చు…
కానీ సినిమా పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసింది అని చెప్పుకోవాలి అన్నా 3.5 కోట్ల దాకా షేర్ ని రెండో రోజు అందుకోవాల్సి ఉంటుంది, మరి ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు అంచనాలను మించి ఉంటే ఈ రేంజ్ కి దగ్గరగా వెళ్ళే ఔట్ రైట్ చాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. మరి 2వ రోజు సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.