Home న్యూస్ 24 గంటల రికార్డ్ 6 గంటల్లో ఔట్….రికార్డు వర్షం కురిపిస్తున్న ఏజెంట్!

24 గంటల రికార్డ్ 6 గంటల్లో ఔట్….రికార్డు వర్షం కురిపిస్తున్న ఏజెంట్!

0

అక్కినేని ఫ్యామిలీ హీరోలలో మొదటి సినిమా టైం కే మాస్ లో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుని భారీ అంచనాల నడుమ హీరోగా లాంచ్ అయిన అఖిల్ అక్కినేని అఖిల్ సినిమాతో నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకోగా తర్వాత మాస్ రూట్ లోకి వెళ్ళకుండా వరుస పెట్టి క్లాస్ మూవీస్ ని చేశాడు… వాటిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఒక్కటి హిట్ గా నిలవగా ఆ సినిమా తర్వాత అఖిల్…

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఏజెంట్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తుండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేయగా అక్కినేని ఫ్యాన్స్ ఎప్పటి నుండో తమ హీరోల నుండి ఎదురు చూస్తున్న ఫుల్ మాస్ మూవీ ఈ మూవీతో సొంతం అయ్యింది అన్న…

సంబరాల్లో ఉన్నారు… ఇక ఏజెంట్ టీసర్ అల్ట్రా స్టైలిష్ గా ఫుల్ రిచ్ గా విజువల్స్ ఎక్స్ లెంట్ గా ఉండటంతో సినిమా పై ఉన్న అంచనాలను ఓ రేంజ్ లో పెంచేసింది. దానికి తోడూ అఖిల్ లుక్ టెర్రిఫిక్ గా ఉండగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి లుక్ కూడా కుమ్మేసింది.

ఇక ఈ టీసర్ అఖిల్ మ్యానరిజమ్స్, యాటిట్యూడ్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇవ్వగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా కుమ్మేసింది. దాంతో ఓవరాల్ గా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టిన ఈ టీసర్ యూట్యూబ్ లో రికార్డుల వర్షం కురిపిస్తుంది ఇప్పుడు. టాలీవుడ్ లో టైర్ 2 మీడియం రేంజ్ హీరోల సినిమాల టీసర్ రికార్డుల బెండు తీస్తూ దూసుకు పోతున్న ఈ టీసర్…

ఇది వరకు 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న నాని అంటే సుందరానికీ టీసర్ నెలకొల్పిన 313K లైక్స్ ని కేవలం 6 గంటల లోపే బ్రేక్ చేసి ఇప్పుడు రికార్డుల వర్షం కురిపించగా 24 గంటల్లో అప్ కమింగ్ మీడియం రేంజ్ మూవీస్ కి బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ ని సెట్ చేయడానికి సిద్ధం అవుతుంది… ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here