పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ చోర్ బజార్. ఆడియన్స్ ముందుకు ఈ మధ్యే వచ్చిన ఈ సినిమా భారీ లెవల్ లో రిలీజ్ అయ్యి మంచి బిజినెస్ ను సొంతం చేసుకుంది. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత టాక్ నెగటివ్ గా రావడం, జనాలు చిన్న సినిమాలను థియేటర్స్ లో చూడటానికి పెద్దగా ఆసక్తి చూపక పోవడం లాంటి కారణాల వలన ఈ సినిమాను…
అస్సలు ఎవ్వరూ కూడా పట్టించు కోలేదు. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర బిజినెస్ కి చాలా దూరంలోనే ఆగిపోయిన సినిమా ఆకాష్ పూరీ ఖాతాలో మరో ఫ్లాఫ్ మూవీ గా నిలిచి పోయింది. పోటి లో సమ్మతమే సినిమా కూడా ఉండగా, ఆ సినిమా కి కూడా…
మిక్సుడ్ టాక్ వచ్చినా ఈ సినిమా కి కూడా అదే రేంజ్ లో టాక్ రావాడంతో కలెక్షన్స్ పరంగా రెండు సినిమాలకు ఎదురుదెబ్బలు తగిలాయి. ఓవరాల్ గా చోర్ బజార్ సినిమా తొలి వారం పది రోజులకే బాక్స్ ఆఫీస్ రన్ ని పూర్తీ చేసుకుని నిరాశ పరిచే కలెక్షన్స్ ని అందుకుంది.
ఒకసారి టోటల్ రన్ లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Nizam: 47L
👉Ceeded: 16L
👉UA: 17L
👉East: 17L
👉West: 8L
👉Guntur: 15L
👉Krishna: 16L
👉Nellore: 7L
AP-TG Total:- 1.43CR(2.40CR~ Gross)
👉KA+ROI+OS: 0.14L
Total WW:- 1.57CR(2.75CR~ Gross)
ఇదీ టోటల్ రన్ లో చోర్ బజార్ సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్…
మొత్తం మీద సినిమాను 3.50 కోట్ల రేంజ్ రేటుకి అమ్మగా సినిమా 4 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ తో 2.43 కోట్ల దాకా నష్టపోయిన సినిమా ఓవరాల్ గా డబుల్ డిసాస్టర్ గా బాక్స్ ఆఫీస్ పరుగును పూర్తీ చేసుకుంది ఇప్పుడు.