కొన్ని సినిమాలు అవడానికి చిన్నవే అయినా ఆడియన్స్ ను ఓ రేంజ్ లో అలరించి బాక్స్ అఫీస్ దగ్గర సెన్సేషనల్ విజయాలను నమోదు చేస్తూ ఉంటాయి, కొన్ని సినిమాలు అంతకిమించి బాక్స్ ఆఫీస్ సక్సెస్ ను సొంతం చేసుకుంటాయి. అలాంటి కోవలోకే వచ్చే సినిమాల్లో బొమ్మరిల్లు సినిమా కూడా ఒక క్లాసిక్ మూవీ లా నిలిచిపోయే సినిమా అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర 2006 టైం లో జనాలను ఓ రేంజ్ లో…
అలరించిన సినిమాల్లో ఈ సినిమా ఒకటి… ఆడియో రిలీజ్ తర్వాత సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగి పోగా చిన్న సినిమానే అయినా ఆ టైం లోనే అల్టిమేట్ బిజినెస్ ను సాధించింది. సిద్దార్థ్ ని లవర్ బాయ్ గా తిరుగు లేని క్రేజ్ వచ్చేలా చేసింది…
జెనీలియాని ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ ని చేసిన బొమ్మరిల్లు ఫ్యామిలీస్ ను ఓ రేంజ్ లో థియేటర్స్ రప్పించేలా చేసింది. టాలీవుడ్ లో రూపొందిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యామిలీ డ్రామా మూవీస్ లో బొమ్మరిల్లు సినిమా కూడా ఒకటి అని చెప్పాలి.
ప్రకాష్ రాజ్ సిద్దార్థ్ ల మధ్య సీన్స్, క్లైమాక్స్ ఎపిసోడ్, పాటలు ఇలా సినిమాలో ఎన్నో హైలెట్స్ ఉన్నాయి. సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి రీసెంట్ గా 16 ఏళ్ళు పూర్తీ చేసుకుంది. ఆ టైం లోనే ఈ సినిమా 8.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను ఓవరాల్ గా సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాలలో 17.4 కోట్ల షేర్ ని సాధించగా వరల్డ్ వైడ్ గా…
24 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర బిజినెస్ మీద 15.4 కోట్ల అల్టిమేట్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది… బొమ్మరిల్లు తర్వాత ఫ్యామిలీ మూవీస్ జోరు మళ్ళీ ఓ రేంజ్ లో పెరిగి పోయింది. కానీ అలాంటి విజయాన్ని అందుకున్న సినిమాలు చాలా తక్కువే… ఫ్యూచర్ లో మరిన్ని ఫ్యామిలీ మూవీస్ రావాలని కోరుకుందాం..