బాక్స్ ఆఫీస్ దగ్గర నవంబర్ నెల ని అన్ సీజన్ అంటారు. ఈ నెలలో పెద్దగా నోటబుల్ మూవీస్ ఏవి కూడా రిలీజ్ కి సిద్ధం అవ్వవు, దాంతో చిన్నా చితకా సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ సారి కూడా ఎప్పటి నుండో రిలీజ్ అవ్వాల్సిన యశోద ఎంట్రీ వలన ఒక నోటబుల్ రిలీజ్ నవంబర్ లో ఎంటర్ అవ్వగా ఆ సినిమా ఉన్నంతలో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుని హిట్ అయింది.
కానీ తర్వాత ఏ సినిమా అయినా ఆకట్టుకుంకుంటుందా అని అందరూ ఎదురు చూస్తున్న తరుణములో లాస్ట్ వీక్ లో వచ్చిన గాలోడు మరియు మసూద సినిమాలు ఆడియన్స్ ను అలరిస్తాయి అన్న నమ్మకం కూడా ఎవ్వరికీ లేదు…
కానీ సైలెంట్ గా వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా ఆడియన్స్ ను అలరించి మొదటి వారంలో రెండూ కలిపి ఆల్ మోస్ట్ 12 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాయి. దాంతో స్ట్రైట్ తెలుగు మూవీస్ హిట్ అవ్వడమే గొప్ప అనుకుంటున్న టైంలో…
ఏకంగా ఒక నెల కూడా తిరగక ముందే ఏకంగా 3 మూడు సినిమాలు తెలుగు లో క్లీన్ హిట్ గీతని దాటడం విశేషం అని చెప్పాలి. దాంతో అన్ సీజన్ అనుకున్న నవంబర్ లో ఏకంగా 3 హిట్లు టాలీవుడ్ కి సొంతం అయ్యాయి. దాంతో బాక్స్ ఆఫీస్ ఎంత అన్ ప్రిడక్టబుల్ అనేది మరోసారి రుజువు అయింది.