Home న్యూస్ సుడిగాలి సుధీర్ “కాలింగ్ సహస్ర” 6 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్!

సుడిగాలి సుధీర్ “కాలింగ్ సహస్ర” 6 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

లాస్ట్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో చిన్న సినిమా అయిన కాలింగ్ సహస్ర(Calling Sahasra) కూడా ఒకటి…. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) హీరోగా తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా ప్రమోషన్స్ లాంటివి లేకుండా చాలా సైలెంట్ గా రిలీజ్ అయింది….

లాస్ట్ ఇయర్ గాలోడు(Gaalodu Movie) తో బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ రివ్యూలతో కూడా మంచి రెవెన్యూను సొంతం చేసుకున్న సుధీర్ ఈ సినిమా తో మెప్పిస్తాడు అనుకున్నా సినిమాకి మిక్సుడ్ రివ్యూలు సొంతం అవ్వగా కలెక్షన్స్ పరంగా కూడా పెద్దగా ఇంపాక్ట్ ఏమి కనిపించలేదు…

ఓవరాల్ గా సినిమా తెలుగు రాష్ట్రాల్లో 6 రోజులు పూర్తి అయ్యే టైంకి 40 లక్షల రేంజ్ లో షేర్ ని 85 లక్షల దాకా గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 45 లక్షల రేంజ్ లో షేర్ ని 1 కోటి రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కించుకుంది. ఓవరాల్ గా సినిమాకి వాల్యూ బిజినెస్ రేంజ్…

1.5 కోట్ల రేంజ్ లో జరిగిందని ట్రేడ్ అంచనా… దాంతో సినిమా మినిమం 1.7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, ఆ లెక్కన సినిమా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 1.25 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here