యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య బాక్ టు బాక్ సూపర్ హిట్ మూవీస్ ని వరుసగా 4 సొంతం చేసుకున్న తర్వాత చేసిన సినిమా థాంక్ యు, విక్రమ్ కుమార్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఆల్ మోస్ట్ 30 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందగా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఊహకందని విధంగా డిసాస్టరస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది.
బాక్స్ ఆఫీస్ దగ్గర 24 కోట్ల వాల్యూ బిజినెస్ ను అందుకున్న ఈ సినిమా 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి టోటల్ రన్ లో కేవలం 4.45 కోట్ల రేంజ్ లో షేర్ ని మాత్రమే అందుకుని 20 కోట్లకు పైగా నష్టాలను మించి బిగ్గెస్ట్ డిసాస్టర్ గా నిలిచింది.
అలాంటి సినిమా టెలివిజన్ రైట్స్ ను ఆల్ మోస్ట్ 5 కోట్ల రేంజ్ రేటు చెల్లించి జెమినీ టీవీ వాళ్ళు సొంతం చేసుకోగా రీసెంట్ గా సినిమాను టెలికాస్ట్ చేయగా సినిమా వచ్చిన TRP రేటింగ్ కూడా నిరాశ కలిగించే విధంగా రేటింగ్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు…
ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు 3.41 టి.ఆర్.పి రేటింగ్ ను మాత్రమే సొంతం చేసుకున్న ఈ సినిమా టెలివిజన్ లో మరీ డిసాస్టర్ అనలేం కానీ బిలో యావరేజ్ అనిపించినా కానీ కొన్న రేటు ప్రకారం అయితే మాత్రం డిసాస్టర్ అనే చెప్పాలి. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇటూ టెలివిజన్ లో తీవ్రంగా నిరాశ పరిచింది ఈ సినిమా…