Home న్యూస్ ఆదిపురుష్ రికార్డ్ ను బ్రేక్ చేసిన పఠాన్!!

ఆదిపురుష్ రికార్డ్ ను బ్రేక్ చేసిన పఠాన్!!

0

బాలీవుడ్ లో కొంత కాలం క్రితం వరకు ఏక చక్రాదిపత్యంగా ఏలిన కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది, అప్పుడెప్పుడో 2014 టైం లో హ్యాప్పీ న్యూ ఇయర్ తో హిట్ కొట్టిన షారుఖ్ తర్వాత ఇప్పటి వరకు హిట్ కొట్టలేదు. షారుఖ్ కొత్త సినిమా వచ్చే 4 ఏళ్ల టైం అవుతూ ఉండగా ఇప్పుడు షారుఖ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పఠాన్ ఆడియన్స్ ముందుకు వచ్చే నెలలో…

25న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా యాక్షన్ సీన్స్ కి ఓవరాల్ టీసర్ కట్ కి ఫ్యాన్స్ నుండి కామన్ ఆడియన్స్ వరకు మంచి రెస్పాన్స్ సొంతం అవ్వగా లైక్స్ పరంగా ఈ టీసర్ ఇప్పుడు బాలీవుడ్ లో…

రిలీజ్ అయిన అన్ని టీసర్లలో ఆల్ టైం హైయెస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ సినిమా టీసర్ లైక్స్ రికార్డ్ ను బ్రేక్ చేసి కొత్త రికార్డ్ ను నమోదు చేసింది. ఆదిపురుష్ సినిమా టీసర్ టోటల్ గా ఇప్పటి వరకు…

1.74 మిలియన్ లైక్స్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు పఠాన్ సినిమా టీసర్ 1.76 మిలియన్ లైక్స్ తో ఆదిపురుష్ టీసర్ లైక్స్ రికార్డ్ ను బ్రేక్ చేసి బాలీవుడ్ లో కొత్త రికార్డ్ ను నమోదు చేసింది, కానీ వ్యూస్ పరంగా ఆదిపురుష్ ఇప్పటి వరకు 102 మిలియన్స్ ని అందుకుంటే పఠాన్ 50 మిలియన్స్ రేంజ్ లోనే ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here