కోలివుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ సార్ తమిళ్ మరియు తెలుగు లో బైలింగువల్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది. కాగా సినిమా మొత్తం మీద 40 కోట్ల రేంజ్ లోనే బడ్జెట్ తో తెరకెక్కగా సినిమా మొత్తం మీద థియేట్రికల్ బిజినెస్ ఏకంగా 35 కోట్ల దాకా సొంతం చేసుకున్న సినిమా… నాన్ థియేట్రికల్ బిజినెస్….
విషయానికి వస్తే సినిమా తమిళ్ తెలుగు కలిపి శాటిలైట్ రైట్స్ కింద 12 కోట్ల రేంజ్ రేటు ని సొంతం చేసుకోగా డిజిటల్ రైట్స్ కింద ఏకంగా 22 కోట్ల రేంజ్ లో రేటుని సొంతం చేసుకోగా హిందీ డబ్బింగ్ శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ కలిపి….
12 కోట్ల రేంజ్ రేటుని సొంతం చేసుకోగా మ్యూజిక్ రైట్స్ కింద 3 కోట్ల దాకా రేటుని సొంతం చేసుకుందట. దాంతో సినిమా టోటల్ నాన్ థియేట్రికల్ రైట్స్ కింద ఏకంగా 49 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి…
ఏకంగా 84 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా సినిమా బడ్జెట్ మీద ఏకంగా 39 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుంది. సినిమా ప్రమోషన్స్ కోసం 4 కోట్ల దాకా ఖర్చు అవ్వగా ఏకంగా 35 కోట్ల ప్రాఫిట్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఈ సినిమా…. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సాలిడ్ ప్రాఫిట్స్ దిశగా దూసుకు పోతుంది.