కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్ కెరీర్ బెస్ట్ ఫామ్ లో దూసుకు పోతున్నాడు, విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ వారసుడు యావరేజ్ తో సీరియల్ అంటూ ట్రోల్ చేసినా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ తో ఊచకోత కోసింది. ఇక ఇప్పుడు నటిస్తున్న లేటెస్ట్ మూవీ లోకేష కనగరాజ్ డైరెక్షన్ లో ఖైదీ, విక్రం సినిమాల LCU లో భాగంగా తెరకెక్కుతూ ఉండటంతో ఈ సినిమా పై అంచనాలు…
స్కై హై లెవల్ లో భారీ ఎత్తున ఉండగా సినిమా కి ముందే భారీ క్రేజ్ ఏర్పడగా సినిమా బిజినెస్ ఆల్ మోస్ట్ అన్ని చోట్లా క్లోజ్ కూడా అయిపోయిందని చెప్పాలి. సినిమా డిజిటల్ రిలీజ్ రైట్స్ కోసం ఏకంగా 120 కోట్ల రేంజ్ రేటుని సొంతం చేసుకోగా…
సినిమా ఇప్పుడు శాటిలైట్ రైట్స్ ని కూడా భారీ రేటుకి అమ్మేశారు… మొత్తం మీద తమిళ్ మరియు తెలుగు శాటిలైట్ రైట్స్ తో పాటు ఇతర భాషల శాటిలైట్ రైట్స్ అన్నీ కలిపి ఏకంగా 100 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుని మరోసారి సంచలనం సృష్టించింది..
కాగా సినిమా జస్ట్ తమిళ్ మరియు తెలుగు శాటిలైట్ రైట్స్ తోనే ఏకంగా 65 కోట్లకు పైగా రేటుని సొంతం చేసుకుంది… ఈ రేంజ్ లో డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ తోనే సినిమా కి ఏకంగా 220 కోట్ల దాకా రేటుని అందుకుని సంచలనం సృష్టించగా రిలీజ్ కి ఇంకా 7 నెలల టైం ఉన్నా కానీ ఈ రేంజ్ లో బిజినెస్ తో సంచలనం సృష్టించడం విశేషం అని చెప్పాలి.