బాక్స్ ఆఫీస్ దగ్గర మెప్పించిన సినిమాలు అన్నీ కూడా టెలివిజన్ లో ఆకట్టుకోవాలి అన్న రూల్ లేదు. పెద్ద సినిమాలు అటు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇటు టెలివిజన్ లో కూడా మంచి రేటింగ్ లను సొంతం చేసుకుంటూ ఉంటాయి కానీ ఇతర కంటెంట్ బేస్ మూవీస్ కి ఇది రిపీట్ చేయడం కొంచం కష్టమే, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ సైలెంట్ గా రిలీజ్ అయ్యి సెన్సేషనల్ టాక్ తో…
ఎవ్వరి ఊహకలకు అందని రేంజ్ లో విజయాన్ని నమోదు చేసిన సినిమా సీతా రామం అటు బాక్స్ ఆఫీస్ తో పాటు ఇటు టెలివిజన్ లో కూడా కుమ్మేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద…
17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఏకంగా 46.50 కోట్ల రేంజ్ లో షేర్ ని 98.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని ఎపిక్ డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన తర్వాత టెలివిజన్ లో కూడా కుమ్మేస్తుంది ఇప్పుడు. ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు సినిమా కి స్టార్ మా ఛానెల్ లో…
8.73 టి.ఆర్.పి రేటింగ్ సొంతం అవ్వగా రీసెంట్ గా సినిమా రెండో సారి కూడా టెలికాస్ట్ అవ్వగా రెండో సారి కూడా బాగా హోల్డ్ చేసిన సినిమా 5.41 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని జోరు చూపించిన సినిమా టెలివిజన్ లో కూడా మంచి రేటింగ్స్ తో హోల్డ్ చేస్తూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషం.