Home న్యూస్ దుల్కర్ సల్మాన్ “చుప్” మూవీ టాక్ ఎలా ఉందంటే!!

దుల్కర్ సల్మాన్ “చుప్” మూవీ టాక్ ఎలా ఉందంటే!!

0

రీసెంట్ గా సీతా రామం సినిమాతో సెన్సేషనల్ డబుల్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న దుల్కర్ సల్మాన్ చేసిన లేటెస్ట్ మూవీ చుప్… హిందీ లో మంచి సినిమాలు తీసే డైరెక్టర్ గా పేరున్న ఆర్ భల్కి డైరెక్షన్ లో సన్నీ డియోల్ మరియు శ్రేయా దంవర్తీ నటించిన ఈ సినిమా ట్రైలర్ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేయగా రీసెంట్ గా సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ కి వస్తే….ఒక సైకోపాత్ సినిమాల రేటింగ్ లు తక్కువ ఇచ్చే వాళ్ళనీ మరీ కావాలనీ ఎక్కువ రేటింగ్ ఇచ్చే వాళ్ళని చంపుతూ ఉంటాడు, దాంతో కొందరు రివ్యూవర్స్ మేం ఆ సైతో పాత్ ని చంపేవరకు రివ్యూలు చేయం అని చెప్పగా ఆ సైకోని పట్టుకోవడానికి పోలిస్ అయిన సన్నీ డియోల్ బరిలోకి దిగుతాడు. మరి తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా కథ…

లాజికల్ గా చెప్పాలి అంటే ఏ రివ్యూలు రాసే వారి రివ్యూలు చదివే వాళ్ళు తక్కువే, వాటిని నమ్మి సినిమాలు వెళ్ళాలా వద్దా అని డిసైడ్ అయ్యే వాళ్ళు తక్కువే… అలాంటి పాయింట్ పై సినిమా అంటే కొద్ది వరకు సిల్లీగానే అనిపిస్తుంది. కానీ ఇలాంటి లాజిక్స్ ఏమి పట్టించుకోకుండా చూస్తె మట్టుకు సినిమాలో థ్రిల్ అయ్యే ఎలిమెంట్స్….

చాలానే ఉన్నప్పటికీ అదే టైం లో నరేషన్ కూడా చాలా నెమ్మదిగా ఉండటంతో బోర్ ఫీల్ అయ్యే మూమెంట్స్ కూడా ఉన్నాయి, దుల్కర్ మాత్రం సీతా రామం కి పూర్తీ కాంట్రాస్ట్ ఉన్న రోల్ లో అదరగొట్టేశాడు. హీరోయిన్ శ్రేయ కూడా ఆకట్టుకోగా సన్నీ డియోల్ రోల్ కూడా మెప్పిస్తుంది… థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మరికొన్ని పడి ఉండి నరేషన్ కూడా కొంచం రేసీ గా ఉండి ఉంటే సినిమా ఇంకా బాగుండేది…

మొత్తం మీద ముగ్గురు లీడ్ పెయిర్ ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్ కి అక్కడక్కడా బాగా థ్రిల్ చేసిన ఎలిమెంట్స్ తో సినిమా ఓవరాల్ స్టొరీ పాయింట్ అంత కన్విన్సింగ్ గా లేక పోయినా కానీ మొత్తం మీద లాజిక్స్ పట్టించుకోకుండా సినిమా చూస్తే సినిమా ఒకసారి చూడొచ్చు అనిపించడం ఖాయమని చెప్పాలి. మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.5 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here