Home గాసిప్స్ బెల్లంకొండ ఛత్రపతి హిందీ రీమేక్ రిలీజ్ డేట్ ఇదేనంట!!

బెల్లంకొండ ఛత్రపతి హిందీ రీమేక్ రిలీజ్ డేట్ ఇదేనంట!!

0

అల్లుడు అదుర్స్ సినిమా తో 2021 సంక్రాంతికి వచ్చిన యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఆ సినిమా ఫ్లాఫ్ తర్వాత తెలుగు సినిమా ఏమి కూడా చేయలేదు, తెలుగు లో ప్రభాస్ రాజమౌళిల కాంబినేషన్ లో వచ్చిన ఛత్రపతి సినిమా ను హిందీ లో రీమేక్ చేయాలని డిసైడ్ అవ్వగా హిందీలో సినిమా షూటింగ్ చాలా కాలంగానే జరుగుతూనే వస్తూ ఉండగా సినిమా కి సంభందించిన ఎలాంటి అప్ డేట్స్ కూడా మేకర్స్…

ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు… దాంతో అసలు ఈ సినిమా ఉందో లేదో అన్న అనుమానాలు మొదలు అవ్వగా ఎట్టకేలకు సినిమా టీం నుండి మీడియా ఇంటరాక్షన్ లో భాగంగా సినిమా గురించి మాట్లాడారు టీం… కాగా సినిమా ఎప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తుంది అన్న ప్రశ్నకి…

ఈ సినిమాను మేం మే నెలలో మొదటి వారంలో పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయాలి అనుకుంటున్నాం అంటూ చెప్పారని సమాచారం. సినిమా బాగా వచ్చిందని, బెల్లంకొండ శ్రీనివాస్ బాగా యాక్ట్ చేశాడని అంటున్నారు. అసలు ఉంటుందో ఉండదో అనుకున్న ఈ సినిమా…

ఇప్పుడు ఆల్ మోస్ట్ ఇక రిలీజ్ ను కన్ఫాం చేసుకోబోతుంది అని చెప్పాలి. మే 5 న రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అంటున్న ఈ సినిమా ను హిందీ ఆడియన్స్ ప్రస్తుతం రీమేక్స్ ని ఆదరించడం లేదు కాబట్టి ఎంతవరకు ఆదరిస్తారో అన్నది ఆసక్తి కరం అని చెప్పాలి. ఈ సినిమాతో హిందీ మార్కెట్ తనకి సొంతం అవుతుందని బెల్లంకొండ కూడా భారీ ఆశలతో ఉన్నాడు.. మరి ఏం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here