మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే మళయాళ ఇండస్ట్రీకి ఈ ఇయర్ హిట్స్ చాలా తక్కువగా సొంతం అవ్వగా ఇయర్ స్టార్టింగ్ లో రోమాంచం సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు 2018 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ రేంజ్ లో రాంపేజ్ ని చూపిస్తూ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…
సినిమా రిలీజ్ కి ముందు మొత్తం మీద బడ్జెట్ పరంగా భారీ బడ్జెట్ తెరకేక్కడంతో ఈ బడ్జెట్ రికవరీ అవుతుందో లేదో అనుకుని ఇండస్ట్రీ వర్గాలు బయపడ్డాయి. మలయాళంలో సినిమాలకు ఎక్కువలో ఎక్కువ 5-10 కోట్ల లోపే బడ్జెట్ తో తెరకెక్కగా 2018 మూవీ మాత్రం మొత్తం మీద…
20 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కింది. దాంతో ఈ బడ్జెట్ రికవరీ అవుతుందో లేదో అనుకున్నారు కానీ సినిమా ఇప్పుడు మొదటి వారంలో వరల్డ్ వైడ్ గా 55 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. సినిమా కేరళలో వర్కింగ్ డేస్ లో చాలా లిమిటెడ్ డ్రాప్స్ తో…
25 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోగా… టోటల్ ఫస్ట్ వీక్ ఇండియా గ్రాస్ 30 కోట్ల దాకా ఉండగా ఓవర్సీస్ గ్రాస్ 25 కోట్లకు పైగా ఉండగా టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 55 కోట్ల గ్రాస్ ను 26 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని ఈ భారీ బడ్జెట్ ను రికవరీ చేసి ఇప్పుడు 100 కోట్ల గ్రాస్ మార్క్ వైపు దూసుకు పోతూ ఉండటం విశేషం….