బాక్స్ ఆఫీస్ దగ్గర బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన హిందీ మూవీ ఛత్రపతి భారీ అంచనాల నడుమ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయడంలో తీవ్రంగా విఫలం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో హిందీలో తొలి అడుగుతోనే మంచి మార్కెట్ ను సొంతం చేసుకోవాలి అనుకున్నా కూడా సినిమా అంచనాలను అందుకోలేక పోయింది…
సినిమాను మొత్తం మీద 85 కోట్ల రేంజ్ బడ్జెట్ లో తెరకెక్కించారు అన్న టాక్ ఉండగా సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కింద హిందీ శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ కలిపి 35 కోట్ల దాకా రికవరీ చేయగా మిగిలిన అమౌంట్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా…
రికవరీ చేయాల్సిన అవసరంతో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన సినిమా మొదటి వారంలో అతి కష్టం మీద కోటి రేంజ్ లో నెట్ కలెక్షన్స్ నే అందుకోగా తర్వాత కూడా పెద్దగా కలెక్షన్స్ ఏమి సొంతం చేసుకోక పోవడంతో వర్త్ షేర్ అటూ ఇటూగా 45 లక్షల రేంజ్ లోనే రాగా…
సినిమా ప్రింట్ ఖర్చులు కూడా ఈ షేర్ రికవరీ చేయలేక పోయింది. ఇది కూడా కౌంట్ చేసుకున్నా కూడా మేకర్స్ కి ఆల్ మోస్ట్ సినిమా 50 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం అయ్యేలా చేసిందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఇది నిజంగానే ఎపిక్ మైండ్ బ్లాంక్ విషయం అని చెప్పాలి ఇప్పుడు.