బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో మంచి లాభాలను సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తున్న బిచ్చగాడు2 సినిమా ఇప్పుడు మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకోవడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా 7వ రోజు కూడా మరోసారి డీసెంట్ అనిపించేలా హోల్డ్ చేసి కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…
సినిమా 6వ రోజుతో పోల్చితే 7వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి 25-30% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. దాంతో సినిమా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు డీసెంట్ గా ఉంటే ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో…
22 లక్షల నుండి 25 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్లా లెక్కలు కొంచం ఎక్కువగా ఉంటే ఈ కలెక్షన్స్ ని కొంచం మించవచ్చు. ఇక తమిళ్ లో పెద్దగా హోల్డ్ ని చూపించలేక పోతున్న సినిమా ఈ రోజు వరల్డ్ వైడ్ గా…
80 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోవచ్చు, ఓవర్సీస్ లో కూడా సినిమా ప్రదర్శన అంతంతమాత్రమే ఉండటం కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపిస్తుంది. అయినా తెలుగు లో హిట్ అయిన సినిమా వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకాస్త కష్టపడాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా ఫస్ట్ వీక్ అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.