బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ లో ఎంతో కొంత జనాలను అట్రాక్ట్ చేసిన సినిమాలు మేమ్ ఫేమస్ మరియు 2018 మూవీలు. ఇందులో 2018 మూవీ మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా మొదటి రోజు సాలిడ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. ఇక మేమ్ ఫేమస్ మూవీ డీసెంట్ స్టార్ట్ తర్వాత స్లో డౌన్ అయింది.
ఇక రెండు సినిమాలు రెండో రోజులో అడుగు పెట్టగా రెండు సినిమాలు కూడా డీసెంట్ గానే పెర్ఫార్మ్ చేస్తుండగా 2018 మూవీ కొన్ని చోట్ల సాలిడ్ గ్రోత్ ని హోల్డ్ చేస్తూ పరుగును కొనసాగిస్తుంది. ఇక మేమ్ ఫేమస్ మూవీ రెండో రోజు 10-15% రేంజ్ లో…
డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు… ఓవరాల్ గా సినిమా అన్ని చోట్లా డ్రాప్స్ ఇదే విధంగా ఉంటే సినిమా రెండో రోజు అటూ ఇటూగా 60 లక్షల రేంజ్ లో గ్రాస్ ను కలెక్ట్ చేసే అవకాశం ఉంది, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 65 నుండి 70 లక్షల దాకా గ్రాస్ వెళ్ళొచ్చు.
ఇక 2018 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజున అటూ ఇటూగా 1 కోటి నుండి 1.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది. అన్ని చోట్లా రిపోర్ట్స్ బాగుంటే 1.4 రేంజ్ లో గ్రాస్ ను అందుకోవచ్చు. ఇక 2 సినిమాల అఫీషియల్ 2 డేస్ కలెక్షన్స్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.