రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) నుండి లాస్ట్ టైం వచ్చిన మంచి సినిమా చెప్పమంటే రక్తచరిత్ర తప్ప మరే సినిమా కూడా మెప్పించలేదు అనే చెప్పాలి. కానీ మళ్ళీ రామ్ గోపాల్ వర్మ నుండి వస్తున్న సినిమా లో…
ఇప్పుడు ఎంతో కొంత ఆసక్తిని పెంచిన సినిమాగా వ్యూహం(Vyooham) సినిమా ని చెప్పుకోవచ్చు. పొలిటికల్ గా ఒక పార్టీకి ఫేవర్ గా ఉన్నట్లు అనిపించేలా టీసర్ ఉన్నప్పటికీ కూడా వింటేజ్ RGV ని గుర్తు చేస్తూ ఈ టీసర్ మెప్పించింది…
2009 టైంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మృతి తర్వాత ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి అన్న నేపధ్యంలో తెరకెక్కిన ఈ వ్యూహం సినిమా కథ ఎలా ఉంటుందో తెలియదు కానీ టేకింగ్ పరంగా మాత్రం ఒకప్పటి రామ్ గోపాల్ వర్మ టచ్ అయితే మళ్ళీ కనిపించింది…బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.
మరి ఇదే విధంగా సినిమా కూడా ఉంటుందో లేదో అన్నది సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది కానీ టీసర్ వరకు అయితే మాత్రం రామ్ గోపాల్ వర్మ తన మార్క్ ని చూపించాడు. మీరు చూసి ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్స్ లో చెప్పండి.
వర్మ ఒక చినిగిన పత్రం అంతే waste fellow
Super RGV garu… Daring dashing Director
వాస్తవాలు చేదుగా ఉంటాయి కొందరికి జీర్ణం కావు
Keep it up sir