బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ తోనే రిలీజ్ అయిన సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ A1 ఎక్స్ ప్రెస్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదట్లో పెద్దగా జోరు చూపక పోయినా కానీ తర్వాత పాజిటివ్ టాక్ అంతటా స్ప్రెడ్ అవ్వడంతో సినిమా వర్కింగ్ డేస్ లో సూపర్ సాలిడ్ గా హోల్డ్ చేసింది. కానీ సినిమా రిలీజ్ అయిన 7 వ రోజున ఏకంగా 4 కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడం తో…
ఈ సినిమా థియేటర్స్ అన్నీ కూడా ఆ సినిమాలకు ఇచ్చేశారు… దాంతో కలెక్షన్స్ పై అది తీవ్ర ఇంపాక్ట్ చూపింది. సెకెండ్ వీకెండ్ సినిమా కలెక్షన్స్ మళ్ళీ గ్రోత్ ని సొంతం చేసుకుంటే బ్రేక్ ఈవెన్ కి చేరువ అయ్యే అవకాశం ఉందీ అనుకున్న సినిమా.
అనుకోకుండా 7 వ రోజు నుండే రేసు నుండి తప్పుకున్నట్లు అయింది. మొత్తం మీద సినిమా 7 వ రోజు 8 లక్షలు, 8 వ రోజు 6 లక్షలు, 9 రోజు 7 లక్షలు, 10 వ రోజు 9 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని మాత్రమే సొంతం చేసుకుని 7 వ రోజు నుండి 10 వ రోజు వరకు మొత్తం మీద 30 లక్షల షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది.
మొత్తం మీద సినిమా 10 రోజుల టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే..
👉Nizam: 1.07Cr
👉Ceeded: 36L
👉UA: 54L
👉East: 38L
👉West: 27L
👉Guntur: 34L
👉Krishna: 34L
👉Nellore: 23L
AP-TG Total:- 3.53CR (6.30Cr Gross~)
Ka+ROI: 12L
Os – 11L
Total WW: 3.76Cr(6.60cr Gross~)
ఇదీ సినిమా మొత్తం మీద 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్.
సినిమాను టోటల్ గా 4.6 కోట్ల రేంజ్ రేటు కి అమ్మగా 5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొత్తం మీద 75% రికవరీ ని ఇప్పటి వరకు అయితే సాధించి యావరేజ్ అనిపించుకుంది. ఇక వర్కింగ్ డేస్ లో అయినా థియేటర్స్ ని పెంచితే బిజినెస్ ను మరింతగా రికవరీ చేసే అవకాశం ఉంటుంది… లేదా పరుగు యావరేజ్ టు ఎబో యావరేజ్ గా ముగిసే చాన్స్ ఉంటుంది.