బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీస్ లో రాధే శ్యామ్ సినిమా అంచనాలను అందుకోవడంలో తీవ్రంగా విఫలం అయిన విషయం తెలిసిందే. సమ్మర్ కానుకగా వచ్చినా అంచనాలను అందుకోవడం విషయంలో తీవ్రంగా నిరాశ పరిచిన తర్వాత ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆది పురుష్ సినిమా ఆడియన్స్ ముందుకు జూన్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా…
సినిమా టీసర్ రిలీజ్ అయినప్పుడు ఊహకందని రేంజ్ లో ట్రోల్స్ ని ఫేస్ చేసిన విషయం తెలిసిందే. దాంతో ఆల్ రెడీ రాధే శ్యామ్ డిసాస్టర్ తర్వాత, ఇలాంటి ట్రోల్స్ నడుమ ఆదిపురుష్ తేరుకుంటుందో లేదో అన్న అనుమానాలు ఉన్న నేపధ్యంలో ట్రైలర్ నుండి రచ్చ చేయడం స్టార్ట్ చేసిన ఈ సినిమా…
ఇప్పుడు బిజినెస్ పరంగా అన్ని చోట్లా దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉంది. సినిమా పై ఇప్పుడు అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ ను కంప్లీట్ చేసుకుందని తెలుస్తుంది. సినిమా టోటల్ తెలుగు రాష్ట్రాల రైట్స్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు…
ఊహకందని రేటు చెల్లించి హక్కులు తీసుకున్నారని తెలుస్తుంది. ఆ రేటు రేంజ్ 150 కోట్ల నుండి 160 కోట్ల దాకా ఉంటుందని అన్న టాక్ వినిపిస్తుంది… ఈ రేంజ్ రేటు అంటే ఇది టాలీవుడ్ చరిత్రలోనే RRR తర్వాత హైయెస్ట్ బిజినెస్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఏరియాల వారి అఫీషియల్ బిజినెస్ లెక్కలు త్వరలో తేలనున్నాయి.