బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(AdiPurush) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి వీకెండ్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకున్నా కానీ తర్వాత ఎదురుకున్న విపరీతమైన ట్రోల్స్ వలన సినిమా తర్వాత తేరుకోలేక పోయింది.
కానీ సినిమా ఎంతో కొంత కలెక్షన్స్ తో నష్టాలను తగ్గించుకునే ప్రయత్నంలో ఉండగా ఇప్పుడు 2 వారాల తర్వాత సినిమా కి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఒక పక్క అందుకోవాల్సిన టార్గెట్ ఇంకా చాలా ఉండగా సినిమా ఇంకా 50 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సి ఉండగా…
థియేటర్స్ సంఖ్య భారీగా తగ్గిపోగా ఇప్పుడు సినిమా ఒరిజినల్ తమిళ్ వర్షన్ మాస్టర్ ప్రింట్ ఆన్ లైన్ లో లీక్ అయింది…. ఓవర్సీస్ కి పంపిన మాస్టర్ ప్రింట్ కాపీ పైరసీ వాళ్ళ దగ్గరకి వెళ్ళడంతో 2 వారాల తర్వాత ఇప్పుడు తమిళ్ వర్షన్ HD వర్షన్ ఆన్ లైన్ లో లీక్ చేశారు..
ఆ తమిళ్ వర్షన్ కి ఇప్పుడు సినిమా ఇతర భాషల ఆడియోని మిక్స్ చేసి ఇతర వర్షన్ లను కూడా లీక్ చేస్తున్నారు. అసలే అందుకోవాల్సిన టార్గెట్ ఇంకా చాలా ఉన్న నేపధ్యంలో ఇప్పుడు సినిమా HD వర్షన్ లీక్ వలన సినిమా బాక్స్ ఆఫీస్ పరుగు పై…
మరింతగా ఇంపాక్ట్ పడే అవకాశం ఉండగా సినిమా ఇక తేరుకునే అవకాశం లేదనే చెప్పాలి. ఒక పక్క తెలుగు రాష్ట్రాల్లో భారీ నష్టాలను సొంతం చేసుకుంటున్న సినిమా ఇక ఈ దెబ్బతో ఇక్కడ కలెక్షన్స్ పై కూడా మరింత ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.