బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చే సంక్రాంతికి అన్ని సినిమాల కన్నా ముందే డేట్ ని కన్ఫాం చేసుకున్న సినిమా ఆది పురుష్, ప్రభాస్ ఓం రౌత్ ల కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ గ్రాఫికల్ వండర్ మూవీ అఫీషియల్ టీసర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి అంచనాలను అందుకోవడం విషయంలో విఫలం అయ్యి గ్రాఫిక్స్ వలన సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ కి కూడా కారణం అయింది.
దాంతో టీం పునరాలోచనలో పడగా సంక్రాతికి సినిమాను ఎంత కుదిరితే అంత గ్రాఫిక్స్ పరంగా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉండగా తెలుగు లో సంక్రాంతి రేసులో ఒకటి తర్వాత భారీ బడ్జెట్ మూవీస్ అన్నీ కూడా రేసులో నిలవడంతో….
ఏ సినిమా తప్పుకుంటుందో అన్న సందేహాలు మొదలు అవ్వగా సడెన్ గా టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తున్న వార్తా ఆదిపురుష్ సినిమా సంక్రాంతి రేసు నుండి తప్పుకుని సమ్మర్ రేసులో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది అని అంటున్నారు…
అసలే గ్రాఫిక్స్ పరంగా ట్రోల్స్ జరగడం, భారీ పోటి ఇటు తెలుగు లో అటు తమిళ్ లో ఉండటంతో కొంచం మిస్ ఫైర్ అయినా భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉండటంతో రేసు నుండి తప్పుకుని ఎంత కుదిరితే అంట క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకుని సమ్మర్ కి ఆడియన్స్ ముందుకు ఈ సినిమాను తేవాలని భావిస్తున్నారట. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతుందని సమాచారం…