బాక్స్ ఆఫీస్ దగ్గర 12 ఏళ్ల క్రితం సంక్రాంతి రేసులో నిలిచి ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా అనుష్క నటించిన అరుంధతి సినిమా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది, చాలా టైం గా డిలే అవుతున్న ఈ సినిమా సడెన్ గా సంక్రాంతి రేసులో ఎంటర్ అవ్వడం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి అల్టిమేట్ కలెక్షన్స్ తో ఊచకోత కోయడం జరిగింది. అలాంటి సినిమా రిలీజ్ అయిన 11 ఏళ్ల తర్వాత రీసెంట్ గా…
హిందీ లో రీమేక్ కి సిద్ధం అయ్యింది. మరో పక్కా ఈ సినిమాను నిర్మించిన ప్రఖ్యాత నిర్మాత శ్యాం ప్రదాస్ రెడ్డి కొత్త సినిమాను మొదలు పెట్టబోతున్నారు. ఎప్పుడో కానీ అద్బుతమైన సినిమా అనిపిస్తే తప్ప నిర్మాతగా మారని శ్యాం ప్రసాద్ రెడ్డి షాకింగ్ ఈ 12 ఏళ్లలో…
మళ్ళీ నిర్మాతగా సినిమాను మొదలు పెట్టలేదు, కారణాలు ఏంటో తెలియదు కానీ ఆయన బ్యానర్ మల్లెమాల నుండి తర్వాత టెలివిజన్ షోల పేర్లు ఎక్కువగా వినిపించాయి కానీ సినిమా ఏది కూడా అనౌన్స్ అయితే కాలేదు, ఎట్టకేలకు అరుంధతి రిలీజ్ అయిన 12 ఏళ్ల తర్వాత…
రీసెంట్ గా మరోసారి కొత్త సినిమా ను మొదలు పెట్టబోతున్నాం అంటూ యాడ్ ఇచ్చి అసిస్టంట్ డైరెక్టర్ లు కావాలంటూ యాడ్ ఇచ్చారు. దాంతో ఆల్ మోస్ట్ 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు కొత్త సినిమా ను శ్యాం ప్రసాద్ రెడ్డి మొదలు పెట్టబోతున్నారు అని అంతా అనుకుంటున్నారు. గ్రాఫిక్ హంగులతో అమ్మోరు, అంజి మరియు అరుంధతి లాంటి సినిమాలతో మెప్పించిన శ్యాం ప్రసాద్ రెడ్డి ఈ సారి…
ఎలాంటి అద్బుతాన్ని తెరకేక్కిస్తారు అన్నది ఆసక్తిగా మారింది… ఇన్నాళ్ళు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరగిందని ఇప్పుడు సినిమా మొదలు పెట్టి తెలుగు లో మరో గుర్తుండిపోయే సినిమాగా నిలిచే సినిమా తీస్తామని ధీమాగా ఉన్నారు టీం. మరి ఆ సినిమా ఏ రేంజ్ లో మెప్పిస్తుందో ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో చూడాలి ఇక.