మన సినిమాలు ఇతర భాషల్లో డబ్ అవ్వడం, ఇతర భాషల సినిమాలు తెలుగు లో డబ్ అవ్వడం అన్నది సర్వసాధారణంగా జరుగుతూ వస్తున్నదే, చాలా వరకు సినిమాల రిలీజ్ సమయంలో డబ్బింగ్ పనులు అన్నీ సక్రమంగా జరిగాయా లేవా, అలాగే ఎడిటింగ్ లాంటివి డబ్బింగ్ టైం లో సరిగ్గా ఉన్నాయా లేవా అంటూ అనేక రీ చెక్ లు చేసుకున్నాకే ఎలాంటి తప్పులు లేవు అనిపిస్తేనే సినిమాలను ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తారు…
కానీ అప్పుడప్పుడు డబ్బింగ్ చెప్పే టైం లో అలాగే టైటిల్స్ మార్చే టైం లో తప్పులు లాంటివి జరగడం కామనే, కానీ ఇది ఇతర భాషల వాళ్ళకి తెలుగు మీద అంతగా గ్రిప్ ఉండదు కాబట్టి ఇక్కడ లోకల్ వాళ్ళని పనిలోకి తీసుకుంటే ఖర్చులు పెరుగుతాయని భావించి…
గూగుల్ తెలుగు ట్రాన్స్ లేటర్ ని వాడుతూ టైటిల్స్ ని తెలుగు లో పెడుతున్నారు. అయినా అప్పుడప్పుడు తప్పులు జరుగాయి కానీ.. తెలుగు లో మొట్ట మొదటి అలాగే ప్రస్తుతం వరుస సినిమాలను తెలుగు లోకి తెస్తున్న లీడింగ్ OTT ఆహా వీడియో వాళ్ళు కూడా ఇలాంటి తప్పులు చేయడం అంత బాలేదు అనే చెప్పాలి.
తెలుగు వాళ్ళు అయ్యి ఉండి తెలుగు లోకి సినిమాలను డబ్ చేస్తున్నప్పుడు టైటిల్స్ ని మార్చడంలో కానీ తెలుగు డబ్బింగ్ కరెక్ట్ గా ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన భాద్యత ఉంటుంది, రీసెంట్ గా తెలుగు లోకి డబ్ అయిన విజయ్ సేతుపతి నటించిన విక్రమార్కుడు సినిమా టైటిల్స్ లో తెలుగు గూగుల్ ట్రాన్స్ లేట్ ని వాడి ఎడిటింగ్ చేశారు.
డైరెక్షన్ ని తెలుగులో దర్శకత్వం అని అంటారు, కానీ గూగుల్ ట్రాన్స్ లేట్ లో దాని మీనికి మాప్స్ చూసేటప్పుడు దిక్కుగా వస్తుంది, అలాంటి చిన్న చిన్న విషయాలు కూడా చూసుకోక పోవడం తో ఆ సినిమా చూసిన టైం లో ఇది నోటిస్ చేసిన వాళ్ళు సోషల్ మీడియా లో తెలుగు యాప్ అయ్యి ఉండి ఇలాంటి మిస్టేక్స్ చేయడం ఏంటి అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరి ఆహా వీళ్ళు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.