Home గాసిప్స్ 110 కోట్ల సినిమా…ఎవ్వరూ పట్టించుకోవడం లేదు!

110 కోట్ల సినిమా…ఎవ్వరూ పట్టించుకోవడం లేదు!

0

జూన్ ఎండ్ టైం లో బాలీవుడ్ ఇండస్ట్రీ టోటల్ ఇండియా కి షాక్ ఇస్తూ ఏకంగా 7 కొత్త సినిమాలను డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేయగా తర్వాత మరిన్ని సినిమాలు కూడా ఈ దారిలో నడిచి ఒకటి తర్వాత ఒకటి డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని కన్ఫాం చేశాయి. వాటిలో దాదాపు గా ఒకటి రెండు సినిమాలు తప్పించి మిగిలిన సినిమా లు డిజిటల్ రిలీజ్ ని కంప్లీట్ కూడా చేసుకున్నాయి.

ఇక రిలీజ్ ను కన్ఫాం చేసుకోని సినిమాలలో రీసెంట్ గా 100 సినిమాలను పూర్తీ చేసుకున్న అజయ్ దేవగన్ నటించిన 101 వ సినిమా భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమా కూడా ఒకటి అని చెప్పాలి. ఈ సినిమా ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు ఏకంగా 110 కోట్ల…

   

భారీ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నారు, ఈ పాటికే సినిమా టెలికాస్ట్ కూడా అవ్వాల్సింది కానీ కారణాలు ఏంటో తెలియదు సినిమా యూనిట్ నుండి టాక్ లేదు, ఇటు డిస్నీ ప్లస్ కూడా పట్టించుకోవడం లేదు అనేది లేటెస్ట్ గా బాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తలు.

80 కోట్ల భారీ బడ్జెట్ తో భారీ గా రూపొందిన ఈ సినిమా పోస్టర్స్ ని కొన్ని కొంత గ్యాప్ తో రిలీజ్ చేసి హైప్ పెంచే ప్రయత్నం చేశారు కానీ తర్వాత యూనిట్ నుండి ఎలాంటి సాంగ్స్ అప్ డేట్ కానీ కొత్త పోస్టర్స్ కానీ రిలీజ్ అవ్వలేదు. దాంతో సినిమా ను సైలెంట్ గా రిలీజ్ చేస్తారా అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి.

యూనిట్ కూడా సినిమాను అమ్మేశాం ఇక ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు అనుకుందేమో అని అంటుండగా డిస్నీ ప్లస్ వాళ్ళు ప్రస్తుతం IPL మొదలు అవుతుండటం తో కొంత గ్యాప్ ఇచ్చి ఈ సినిమాను రిలీజ్ చేస్తారేమో, అందుకే పట్టించుకోవడం లేదు అని అంటున్నారు. కారణం ఏదైనా ఈ పాటికే రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇప్పుడు ఎప్పుడు వస్తుందో అన్నది క్లారిటీ లేకుండా పోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here