నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా బాలయ్య బోయపాటి ల కాంబోలో వస్తున్న 3 వ సినిమా అవ్వడం, సింహా లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత వీళ్ళ కాంబోలో వస్తున్న హాట్రిక్ మూవీ అవ్వడం తో అంచనాలు ఇంకా ఎక్కువ అయ్యాయి అని చెప్పాలి.
కానీ ఈ సినిమా మొదలు అయ్యే టైం లో పరిస్థితులు కంప్లీట్ గా వేరుగా ఉండేవి, బాలయ్య హాట్రిక్ భారీ డిసాస్టర్లతో ఉండగా బోయపాటి సరైనోడు సినిమా తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర మరో హిట్ ని అందుకోలేక ఫ్లాఫ్స్ లో ఉండగా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా…
అనగానే అంచనాలు అయితే పెరిగినా కానీ ఎక్కడ కూడా ఓవర్ బడ్జెట్ అవ్వకూడదు అనుకున్నారు… బాలయ్య బోయపాటి కలిసి సినిమాను 25-30 కోట్ల రేంజ్ బడ్జెట్ లో చేయాలనీ ప్లాన్ చేసి సినిమాను మొదలు పెట్టారు కానీ తర్వాత పరిస్థితులు మారిపోయి సినిమా రేంజ్ కూడా పెరిగి పోతూ ఉండటం తో….
క్వాలిటీ విషయంలో ఎలాంటి వెనకడుగు వద్దూ అనుకున్న నిర్మాత బడ్జెట్ పెంచుతూ పోగా సినిమా రేంజ్ కూడా పెరుగుతూ పోయి ఏకంగా 60 కోట్ల మార్క్ ని అధిగమించిన తర్వాత కరోనా ఇంపాక్ట్ కూడా రావడంతో మరింత ఆలస్యం అవ్వడం లాంటివి ఇంపాక్ట్ చూపి ఇప్పుడు రిలీజ్ కి సిద్ధం అవుతున్న వేల సినిమా ఓవరాల్ బడ్జెట్ లెక్క ట్రేడ్ లో 70 కోట్ల రేంజ్ లో ఉంటుందని…
ఇప్పుడు చెబుతున్నారు. ముందు అనుకున్న 30 కోట్ల లెక్క ప్రకారం చూసుకున్నా ఏకంగా డబుల్ కి మించి పోయే రేంజ్ బడ్జెట్ లో అఖండ కంప్లీట్ అయ్యింది అని తెలుస్తుంది, సినిమా బిజినెస్ కూడా ఇదే రేంజ్ లో జరుగుతూ ఉందని బడ్జెట్ మీద మేకర్స్ కి ప్రాఫిట్స్ ఖాయం అన్న టాక్ వినిపిస్తుంది. త్వరలోనే సినిమా కంప్లీట్ బిజినెస్ లెక్కలు బయటికి రానున్నాయి.