నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి దుమ్ము లేపిన విషయం అందరికీ తెలిసిందే. వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న బాలయ్య కి కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో 75 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది ఓవరాల్ గా….
తర్వాత టెలివిజన్ లో టెలికాస్ట్ అయినప్పుడు సినిమాకి ఫస్ట్ టెలికాస్ట్ లో 13.31 టి.ఆర్.పి రేటింగ్ సొంతం అవ్వగా సినిమాను తర్వాత డబ్ చేసి తమిళ్ లో టెలికాస్ట్ చేశారు. ఎలాంటి ప్రచారం లాంటివి పెద్దగా ఏమి చేయకుండా సైలెంట్ గా సినిమాను టెలివిజన్ లో టెలికాస్ట్ చేయగా…
ఓవరాల్ గా ఫస్ట్ టైం అక్కడ టెలికాస్ట్ అయినప్పుడు సినిమా కి కేవలం 1.67 టి.ఆర్.పి రేటింగ్ మాత్రమె సొంతం అయింది. కొంచం బెటర్ గా ప్రమోట్ చేసి ఉంటె తమిళ్ లో రేటింగ్ ఇంకా బెటర్ గా ఉండేది. బాక్స్ ఆఫీస్ దగ్గర, డిజిటల్ లో తర్వాత తెలుగు టెలివిజన్ లో కుమ్మేసిన సినిమా తమిళ్ లో కొంచం తగ్గాల్సి వచ్చింది.