Home న్యూస్ $650K…..బాలయ్య మాస్ పవర్ చూపాల్సిందే!!

$650K…..బాలయ్య మాస్ పవర్ చూపాల్సిందే!!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ అఖండ. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ డిసెంబర్ 2 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా థియేట్రికల్ ట్రైలర్ సినిమా పై ఉన్న అంచనాలను ఓ రేంజ్ లో పెంచేసింది అని చెప్పాలి.

దాంతో సినిమా ఆడియన్స్ ముందుకు ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉండగా సినిమా బిజినెస్ పనులు కూడా ఇప్పుడు మొదలు అయ్యాయి. అందులో భాగంగా సినిమా ఓవర్సీస్ లో బిజినెస్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యిందని సమాచారం. ముఖ్యంగా అమెరికాలో సినిమా బిజినెస్ పూర్తీ అయ్యిందట.

డిసెంబర్ 1 న ప్రీమియర్స్ తో అక్కడ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఓవరాల్ గా 2.1 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను అక్కడ సొంతం చేసుకుందట. ఇది ప్రీవియస్ బాలయ్య మూవీస్ లో రూలర్ కాకుండా చూసుకుంటే తక్కువ బిజినెస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎంత క్రేజ్ ఉన్న మూవీనే అయినా…

బోయపాటి సినిమాలకు అమెరికాలో కలెక్షన్స్ రావడం చాలా కష్టమే అవుతుంది, ఇప్పటి వరకు అక్కడ బోయపాటి మూవీస్ లో సరైనోడు $879K డాలర్స్ ని కలెక్ట్ చేసి టాప్ లో ఉండగా ఇప్పుడు అఖండ సినిమా అక్కడ హిట్ అవ్వాలి అంటే లాంగ్ రన్ లో $650K మార్క్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక టోటల్ ఓవర్సీస్ బిజినెస్ లెక్క…

2.5 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఇక సినిమా తెలుగు రాష్ట్రాలలో సాధించే బిజినెస్ లెక్కలు కూడా త్వరలో ఒక్కటిగా రివీల్ కాబోతున్నాయి. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఇక్కడ అక్కడా ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది ఈ కలెక్షన్స్ ని ఎంతవరకు రికవరీ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారిందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here