Home గాసిప్స్ 10 కోట్ల నుండి 35 కోట్లు….మెంటల్ మాస్ క్రేజ్!!

10 కోట్ల నుండి 35 కోట్లు….మెంటల్ మాస్ క్రేజ్!!

0

ఒక్క హిట్ మూవీ తో ఫేట్ మొత్తం మారిపోతుంది అంటారు… ఇప్పుడు అలాంటి హిట్ తో తన ఫేట్ నే మార్చుకున్నాడు కోలివుడ్ హీరో శివ కార్తికేయన్. తన లేటెస్ట్ మూవీ డాక్టర్ మరీ అద్బుతమైన రివ్యూలు ఏమి సొంతం చేసుకోకున్నా కానీ కామెడీ కలిసి రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని 100 కోట్ల మార్క్ ని అధిగమించి సంచలన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసింది.

ఈ సినిమా విజయంతో శివ కార్తికేయన్ క్రేజ్ డబుల్ అయిపొయింది అని చెప్పాలి. అంతకుముందు కూడా శివ కార్తికేయన్ సినిమాలకు మంచి డిమాండ్ ఉండేది కానీ డాక్టర్ అల్టిమేట్ బ్లాక్ బస్టర్ విజయంతో అక్కడ క్రేజ్ డబుల్ అవ్వడం తెలుగు లో ఒక్క సినిమాకే మార్కెట్ ఏర్పడటం…

ఈ సినిమా తర్వాత శివ కార్తికేయన్ ఒప్పుకున్న బైలింగువల్ మూవీస్ పై కూడా మంచి డిమాండ్ ఏర్పడేలా చేసిందని సమాచారం. దాంతో శివ కార్తికేయన్ కి తమిళ్ తెలుగు కలిపి వరుస పెట్టి బైలింగువల్ ఆఫర్స్ వస్తున్నాయని కోలివుడ్ టాక్. డాక్టర్ తెలుగు లో చడీ చప్పుడు లేకుండా వచ్చి…

4.2 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా కన్నా ముందు శివ కార్తికేయన్ ఒక్కో సినిమాకి మినిమమ్ 10 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని తీసుకునే వాడట. కానీ డాక్టర్ విజయం కన్నా ముందు కమిట్ అయిన బైలింగువల్ మూవీ కి 24 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు వార్తలు రాగా ఇప్పుడు డాక్టర్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత…

అప్ కమింగ్ బైలింగువల్ ప్రాజెక్ట్ లకు ఏకంగా 35 కోట్ల రేంజ్ రెమ్యునరేషన్ తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇంకొంక విజయం డాక్టర్ రేంజ్ లో పడితే కోలివుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా శివ కార్తికేయన్ నిలవడం ఖాయం అంటున్నారు. తెలుగు లో కూడా విజయ్ తర్వాత మార్కెట్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉన్న యాక్టర్స్ లో శివ కార్తికేయన్ కూడా నిలిచే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here