Home న్యూస్ సెన్సేషనల్ మూవీ కి సీక్వెల్ తీయనున్న విక్రం కుమార్!!

సెన్సేషనల్ మూవీ కి సీక్వెల్ తీయనున్న విక్రం కుమార్!!

0

డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే అతికొద్ది మంది డైరెక్టర్స్ లో విక్రం కుమార్ కూడా ఒకరు, 13B, ఇష్క్, 24, మనం, హలో మరియు గ్యాంగ్ లీడర్ ఇలా ఏ సినిమా కి ఆ సినిమా చాలా డిఫెరెంట్ గా చేసిన విక్రం కుమార్ ఇప్పుడంటే కొద్దిగా ఫాం తగ్గినట్లు అనిపించింది కానీ 13 బి, 24 మరియు మనం లాంటి అతి క్లిష్ట మైన సినిమాలు తీసి ఆడియన్స్ ని…

మెప్పించడం ఒక్క విక్రం కుమార్ కే చెల్లింది. మనం టాలీవుడ్ క్లాసిక్ గా మిగలగా 13 బి మోస్ట్ డిఫికల్ట్ మూవీ గా చెప్పుకోవచ్చు, ఇక 24 సినిమా టైం ట్రావెల్ కాన్సెప్ట్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ గా చెప్పుకోవాలి. సూర్య విలనిజం, తిరు కెమరా టేకింగ్, రెహ్మాన్ మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్…

ఇక విక్రం కుమార్ డైరెక్టర్ ఆ సినిమా ని క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ మూవీస్ లో ఒకటిగా చేసింది, ఇప్పుడు విక్రం కుమార్ లాక్ డౌన్ వలన ఖాళీ గా ఉండటం తో ఆ సెన్సేషనల్ మూవీ కి సీక్వెల్ కథ రాసుకుంటున్నారట… కథ ఓ 30% కూడా కంప్లీట్ అయిందని టాక్..

ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోలతో ఒకటి రెండు మూవీస్ కమిట్ అవుతున్న విక్రం కుమార్, వాటి తో పాటే ఈ సినిమా కథని కంప్లీట్ చేసి తర్వాత సూర్య తో కలిసి సినిమా ను తెరకెక్కించా లని భావిస్తున్నట్లు సమాచారం, కానీ కథ తాను అనుకున్న విధంగా వస్తేనే సినిమా చేస్తానని లేదంటే చేయనని విక్రం కుమార్ చెబుతున్నాడు.

విక్రం కుమార్ మూవీస్ లో స్పెషల్ గా చెప్పుకునే 24 సినిమా కి సీక్వెల్ అనే సరికి సోషల్ మీడియా లో సినిమా పై ఇప్పటి నుండే ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని కామెంట్స్ చేస్తున్నారు చాలా మంది, సూర్య కి తమిళ్ అండ్ తెలుగు లో కూడా చివరి బెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా, మళ్ళీ సీక్వెల్ ఓకే అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపడం ఖాయమని చెప్పొచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here