Home టోటల్ కలెక్షన్స్ 140 కోట్లు పెట్టి సినిమా తీస్తే వచ్చింది ఇది….బిగ్గెస్ట్ ఫ్లాఫ్స్ లో ఒకటి!!

140 కోట్లు పెట్టి సినిమా తీస్తే వచ్చింది ఇది….బిగ్గెస్ట్ ఫ్లాఫ్స్ లో ఒకటి!!

0

బడ్జెట్ వైజ్ చాలా సినిమాలు థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ లతో చాలా వరకు రికవరీ అవుతాయి కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోవడంలో విఫలం అయితే మట్టుకు నిర్మాతలకు అప్పుడప్పుడు నష్టాలు రావడం ఖాయం, బాలీవుడ్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన అక్షయ్ కుమార్ ఇమ్రాన్ హష్మీల కాంబోలో వచ్చిన సినిమా సెల్ఫీ అట్టర్ డిసాస్టర్ గా నిలిచి తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుంది.

ఏ రేంజ్ లో అంటే ఇండియన్ ఇండస్ట్రీలలో చాలా చిన్న మార్కెట్ అయిన మలయాళ ఇండస్ట్రీలో తెరకెక్కిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమా రీమేక్ గా వచ్చిన ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ గ్రాస్ ను కూడా అందుకోలేక్ పోయింది. ఒరిజినల్ వర్షన్ 27 కోట్ల లోపు గ్రాస్ ను అందుకుంటే…

ఇండియాలోనే బిగ్ స్టార్స్ లో ఒకరైన అక్షయ్ కుమార్ నటించిన సేల్ఫీ టోటల్ రన్ లో ఇండియాలో 16.8 కోట్ల నెట్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా 25 కోట్ల లోపు గ్రాస్ ను అందుకుంది. వరల్డ్ వైడ్ షేర్ 12 కోట్ల లోపు సొంతం చేసుకున్న ఈ సినిమా బడ్జెట్ తో కంపేర్ చేసి చూస్తె…

128 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుందని చెప్పాలి. నిర్మాతకి అన్ని రైట్స్ కలిపి 75 కోట్ల దాకా రికవరీ అయినా 65 కోట్లు ప్లస్ ప్రమోషన్ ఖర్చులు మొత్తం నష్టాలే అని చెప్పాలి. రీసెంట్ టైంలో బిగ్ స్టార్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బిగ్ ఫ్లాఫ్ మూవీ గా ఈ సినిమాను బాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here