Home న్యూస్ థియేటర్స్ దద్దరిల్లిపోతాయి….కాచుకోండి అంటున్న నాని!!

థియేటర్స్ దద్దరిల్లిపోతాయి….కాచుకోండి అంటున్న నాని!!

0

నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ దసరా అన్ని పనులను పూర్తీ చేసుకుని ఆడియన్స్ ముందుకు ఈ నెల 30 న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. సినిమా పై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పడగా నాని అండ్ టీం సినిమాను అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువగానే ప్రమోట్ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. రిలీజ్ కి టైం కొద్ది కొద్దిగా దగ్గర అవుతున్న కొద్దీ…

ప్రమోషన్స్ జోరుని ఇంకా పెంచుతున్న టీం మీడియాతో రీసెంట్ తో ఇంటరాక్షన్ అవ్వగా మరోసారి నాని ఈ సినిమా ఎంత నమ్మకంతో ఉన్నాడో మరోసారి తన కామెంట్స్ తో అంచనాలను మళ్ళీ భారీగా పెరిగేలా చేశాడు అని చెప్పాలి ఇప్పుడు…

ప్రతీ ఇంటర్వ్యూలో సినిమా పై ఫుల్ ధీమా గా మాట్లాడుతున్నారు, సినిమా మీద అంత నమ్మకం ఏంటి అన్న ప్రశ్నకి నాని మళ్ళీ మాట్లాడుతూ నేను మళ్ళీ చెబుతున్నాను… మీరు ఇది ఓవర్ కాన్ఫిడెంట్ తో చెబుతున్నాను అనుకోవద్దు కానీ నా గట్ ఫీలింగ్ ఏంటి అంటే ఈ సినిమా థియేటర్స్ లో….

ఓ రేంజ్ లో దద్దరిల్లిపోయే రేంజ్ లో దుమ్ము లేపడం ఖాయం అంటూ కామెంట్ చేశాడు నాని… ఈ రేంజ్ లో సినిమా పై నాని కాన్ఫిడెంట్ చూస్తూ ఉంటే సినిమా కూడా ఇదే రేంజ్ లో కనుక ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కచ్చితంగా ఈ సినిమా సంచలన కలెక్షన్స్ తో దుమ్ము లేపడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here