బాక్స్ ఆఫీస్ దగ్గర ఆర్ ఆర్ ఆర్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 18 వ రోజు అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువ డ్రాప్స్ ను సొంతం చేసుకుని భారీ గా స్లో అయింది. సినిమా తెలుగు రాష్ట్రాలలో వరుసగా ప్రతీ రోజు కోటి రేంజ్ కి తగ్గని షేర్ ని 17 రోజుల పాటు కొనసాగగా 18 వ రోజు కూడా మరీ ఈ రేంజ్ డ్రాప్స్ ను సొంతం చేసుకుంటుంది అనుకోలేదు కానీ సినిమా 3.9 కోట్లు డ్రాప్ అయ్యి….
సినిమా 81 లక్షల రేంజ్ షేర్ తో కోటి లోపు షేర్ తో 17 రోజుల పాటు 1 కోటి రేంజ్ షేర్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. మొత్తం మీద టాలీవుడ్ సినిమా హిస్టరీలో ఎక్కువ సార్లు ప్రతీ రోజూ కోటి కి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకున్న సినిమాలలో…
ఆర్ ఆర్ ఆర్ మూవీ 17 రోజుల పాటు కొనసాగించి టాప్ 4 ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఇక బాహుబలి సిరీస్ ఆల్ టైం టాప్ లో ఉండగా అల వైకుంఠ పురంలో నాన్ బాహుబలి మూవీస్ లో 17 రోజుల పాటు 1 కోటికి తగ్గకుండా షేర్ ని అందుకుని మూడో ప్లేస్ ని…
ఓవరాల్ గా సొంతం చేసుకోగా మొత్తం మీద టాలీవుడ్ చరిత్రలో ఎక్కువ రోజులు నాన్ స్టాప్ గా రోజుకి కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే…
👉#Baahubali2 – 28 Days
👉#Baahubali – 20 Days
👉#AlaVaikunthapurramuloo – 17 Days
👉#RRRMovie – 17 Days****
👉#F2 – 16 Days
👉#Rangasthalam – 14 Days
👉#Maharshi – 14 Days
👉#SyeRaa – 13 Days
👉#SarileruNeekevvaru – 13 Days
ఆర్ ఆర్ ఆర్ మూవీ బాహుబలి2 ని అందుకునే అవకాశం లేకున్నా కానీ…
బాహుబలి1 దగ్గరకు అయినా వెళుతుంది అనుకుంటే సినిమా మొత్తం మీద 4 వ ప్లేస్ తో సరిపెట్టుకుంది…. ఓవరాల్ గా ఈ లిస్టులో బడ్జెట్ వైజ్ తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాల్లో ఎఫ్ 2 సినిమా 16 రోజులు నాన్ స్టాప్ గా దుమ్ము లేపింది. ఎపిక్ బాహుబలి2 ఎవ్వరికీ అందనంత ఎత్తులో 28 రోజులతో టాప్ లో ఉండగా ఈ రికార్డ్ ఫ్యూచర్ లో కూడా బ్రేక్ చేసే అవకాశం కూడా చాలా తక్కువగానే ఉన్నాయి అని చెప్పాలి.