బాక్స్ ఆఫీస్ దగ్గర అక్కినేని ఫ్యామిలీ హీరోల పరిస్థితి ఏమాత్రం ఆశించిన విధంగా లేదు, లాస్ట్ ఇయర్ బంగార్రాజు తో మంచి హిట్ లభించినా కానీ తర్వాత అక్కినేని హీరోలు చేసిన సినిమాలు ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ అయ్యి ఒకటికి మించి ఒకటి తీవ్రంగా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ కలిగించాయి. నాగ చైతన్య విక్రం కుమార్ ల కాంబోలో వచ్చిన థాంక్ యు సినిమా…
అట్టర్ డిసాస్టర్ అవ్వగా నాగార్జున మరియు ప్రవీణ్ సత్తారు కాంబోలో వచ్చిన ఘోస్ట్ మూవీ కూడా ఎపిక్ డిసాస్టర్ గా నిలిచింది. ఇక అక్కినేని ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్న అఖిల్ అక్కినేని సురేందర్ రెడ్డి ల కాంబోలో వచ్చిన ఏజెంట్ మూవీ…
థాంక్ యు మరియు ఘోస్ట్ సినిమాలను మించిన డిసాస్టర్ మూవీగా నిలిచి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇలాంటి టైంలో టోటల్ అక్కినేని అభిమానులు కూడా నాగ చైతన్య వెంకట్ ప్రభుల కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ కస్టడీ మీదే ఆశలను పెట్టుకున్నారు.
ఈ సినిమా కి ఇన్ సైడ్ రిపోర్ట్స్ కొంచం పాజిటివ్ గానే ఉండటంతో ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత టాక్ బాగుంటే కచ్చితంగా మంచి విజయాన్ని అందుకునే అవకాశం ఉంటుంది. మరి నాగ చైతన్య ఈ సినిమా తో హిట్ కొట్టి కంబ్యాక్ సొంతం చేసుకోవడమే కాదు మళ్ళీ అక్కినేని హీరోల సినిమాలకు బాక్స్ ఆఫీస్ దగ్గర దారి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.