Home TRP రేటింగ్ అల్లు అర్జున్ సెన్సేషన్…లాస్ట్ వీక్ హిందీ లో టాప్ లేపిన TRP రేటింగ్!!

అల్లు అర్జున్ సెన్సేషన్…లాస్ట్ వీక్ హిందీ లో టాప్ లేపిన TRP రేటింగ్!!

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఇక్కడ ఎలాంటి క్రేజ్ ఉందో పక్క రాష్ట్రాలలో కూడా అదే రేంజ్ లో క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే, తన సినిమా లు అన్ని మలయాళం లో కూడా సూపర్ సక్సెస్ అవుతున్న విషయం తెలిసిందే, ఇక తమిళ్ లో కర్ణాటక లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ ఇక్కడ కి మించి నార్త్ సైడ్ లో సాలిడ్ క్రేజ్ ఉన్న హీరో.

అది అల్లు అర్జున్ పాత సినిమాల వ్యూస్ రికార్డులు చూస్తె అర్ధం అవుతుంది, సరైనోడు, దువ్వాడ జగన్నాథం లాంటి సినిమాలు యూట్యూబ్ లో రిలీజ్, రీ రిలీజ్ చేసిన ప్రతీ సారి కూడా అల్టిమేట్ రికార్డులతో ఊచకోత కోయడం మనం చూస్తూనే ఉన్నాం.

ఇక అక్కడ టెలివిజన్ లో కూడా అల్లు అర్జున్ మూవీస్ టెలికాస్ట్ అయిన ప్రతీ సారి కూడా సాలిడ్ TRP రేటింగ్ ను సొంతం చేసుకుంటూనే ఉన్నాయి, లేటెస్ట్ గా మరో సారి తన స్టామినా ఏంటో మరో సారి రుజువు చేసుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. లాస్ట్ వీక్ హిందీ లో టెలికాస్ట్ అయిన అన్ని సినిమాల్లో…

టాప్ 5 TRP ఇంప్రెషన్ పాయింట్స్ ని బార్క్ అఫీషియల్ గా రిలీజ్ చేయగా టాప్ 5 లో 2 సినిమా లతో దుమ్ము లేపాడు అల్లు అర్జున్, 4 ఏళ్ల క్రితం వచ్చిన సరైనోడు, హిందీ మూవీస్ ని దాటేసి టాప్ TRP ఇంప్రెషన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా, మళ్ళీ 4 వ ప్లేస్ లో 5 ఏళ్ల క్రితం చేసిన….

సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా కూడా నిలిచి దుమ్ము లేపింది, నార్త్ లో అల్లు అర్జున్ ఈ రేంజ్ క్రేజ్ చూసే ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీ అయిన పుష్ప ని పాన్ ఇండియా లెవల్ లో రూపొందిస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత శరవేగంగా షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా వచ్చే ఇయర్ సమ్మర్ కానుకగా రిలీజ్ అవుతుందని సమాచారం…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here