Home గాసిప్స్ ఉప్పెన సినిమాకి షాకింగ్ OTT ఆఫర్….అయినా నో చెప్పారు!!

ఉప్పెన సినిమాకి షాకింగ్ OTT ఆఫర్….అయినా నో చెప్పారు!!

787
0

ఈ లాక్ డౌన్ ఎఫెక్ట్ అన్నింటి కన్నా ఎంటర్ టైన్ మెంట్ ఫీల్డ్ కి ఎక్కువ దెబ్బ కొట్టింది అని చెప్పొచ్చు, సినిమా లు లేక షూటింగ్ లు లేక చాలా మంది ఇబ్బంది పడుతుండగా టెలివిజన్ లో కూడా సీరియల్స్ ప్రోగ్రామ్స్ లేక వేసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ వేస్తున్నారు. ఇక థియేటర్స్ లో సినిమా లు లేక పోవడం తో OTT లో ఎక్కువ సినిమాలు చూస్తున్నారు ఆడియన్స్.

ఆ అడ్వాంటేజ్ నే వాడుకుని చాలా స్ట్రీమింగ్ యాప్స్ భారీ రేట్లు చెల్లించి రిలీజ్ కి సిద్దంగా ఉండి ఆగిపోయిన సమ్మర్ మూవీస్ ని టార్గెట్ చేస్తూ భారీ ఆఫర్స్ ఇస్తున్నాయి కానీ వాటి లో కొన్ని చిన్న సినిమా లు మాత్రమె డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి ఓకే చెబుతున్నాయి.

ఇక ఈ ఆఫర్స్ రేంజ్ అనేది సినిమాల క్రేజ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అని చెప్పొచ్చు. లేటెస్ట్ గా టాలీవుడ్ లో హీరో గా లాంచ్ కాబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటించిన మొదటి సినిమా ఉప్పెన పై మంచి బజ్ పాటలకు వచ్చిన అల్టిమేట్ రెస్పాన్స్ వలన…

మరింత పెరిగి పోగా ఈ సినిమా కి లీడింగ్ OTT యాప్స్ మంచి రేటు నే ఆఫర్ చేస్తున్నాయట. ఆ రేటు 14 కోట్ల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ రేటు డెబ్యూ హీరోకి సాలిడ్ ఆఫర్ అని ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నా యూనిట్ మాత్రం ససేమిరా అమ్మమం థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని చెప్పారట….

దాంతో రేటు మరింత పెంచి ట్రై చేసినా కానీ యూనిట్ ఖరాఖండిగా అమ్మమని చెప్పారట. దాంతో ఈ సినిమా లాక్ డౌన్ తర్వాత ఎట్టి పరిస్థితులలో థియేటర్స్ లో నే రిలీజ్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు. డెబ్యూ మూవీ కాబట్టి రెస్పాన్స్ ఎలా ఉంటుంది, వైష్ణవ్ తేజ్ నటన ఎలా ఉంటుంది అన్నది ఆసక్తిగా మారిందని చెప్పొచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here