బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక టైంలో టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా ఉన్నప్పటికీ కూడా భారీ బ్లాక్ బస్టర్స్ కోసం ఎదురు చూస్తున్న టైంలో 2020 టైంలో అల వైకుంఠ పురంలో సినిమాతో తెలుగు వర్షన్ కి గాను ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తర్వాత పుష్ప పార్ట్ 1 మాస్ రచ్చ చేయగా…
తెలుగు వర్షన్ అంచనాలను అంతగా అందుకోలేక పోయినా కూడా హిందీ లో ఊహకందని కలెక్షన్స్ తో ఊచకోత కోసింది…ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన పుష్ప2(Pushpa 2 The Rule), ఇప్పుడు టాలీవుడ్ రికార్డులను, బాలీవుడ్ రికార్డులనే కాకుండా ఏకంగా ఇండియన్ సినిమా…
రికార్డుల బెండు తీస్తూ బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో ఊచకోత కోస్తూ దూసుకు పోతుంది…కాగా ఇప్పుడు అల్లు అర్జున్ నటించిన లాస్ట్ 3 సినిమాల గ్రాస్ కలెక్షన్స్ లెక్క ఏకంగా 2000 కోట్ల మార్క్ ని అందుకుని ఊహకందని రికార్డ్ ను నమోదు చేసి లెక్కలన్నీ మార్చేశాడు అల్లు అర్జున్…
ఇండియన్ హీరోలలో ఈ రికార్డ్ ముందు ప్రభాస్(Prabhas) సొంతం చేసుకోగా తర్వాత షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) అందుకోగా…అమీర్ ఖాన్ దంగల్ చైనా కలెక్షన్స్ తో ఈ రికార్డ్ ను సాధించాడు…. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ ఈ మార్క్ ని సాధించి మాస్ ఊచకోత కోసి…
ఈ మమ్మోత్ బెంచ్ మార్క్ ని అందుకున్న హీరోలలో ఒకడిగా నిలిచాడు…అల వైకుంఠ పురంలో సినిమాతో టోటల్ రన్ లో 256 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోగా తర్వాత చేసిన పుష్ప సినిమా 360 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా ఇప్పుడు పుష్ప2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర…
1400 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించగా మూడు సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర 2000 కోట్ల మార్క్ ని దాటేసిన అల్లు అర్జున్…ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకడిగా దూసుకు పోతున్నాడు. ఇక లాంగ్ రన్ లో పుష్ప2 ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి.