Home న్యూస్ 35 కోట్ల బడ్జెట్…65 కోట్ల OTT బిజినెస్…గులాబో సితాబో రివ్యూ..ఇందుకే అమ్మారా??

35 కోట్ల బడ్జెట్…65 కోట్ల OTT బిజినెస్…గులాబో సితాబో రివ్యూ..ఇందుకే అమ్మారా??

0

లాక్ డౌన్ వలన రిలీజ్ కి సిద్దంగా ఉన్న చాలా సినిమాలు రిలీజ్ ఆగిపోగా, కొన్ని OTT యాప్స్ ఈ సినిమాలకు మంచి క్రేజీ ఆఫర్స్ ఎరజూపి తమ స్ట్రీమింగ్ యాప్స్ లో డైరెక్ట్ రిలీజ్ కి ఒప్పించాయి. కాగా అలా రీసెంట్ గా బిగ్గెస్ట్ డీల్ ని సొంతం చేసుకున్న క్రేజీ మూవీ గులాబో సితాబో సినిమా ఈ రోజు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీం అవ్వడం మొదలు పెట్టింది.

సినిమా ను 35 కోట్ల బడ్జెట్ లో రూపొందించగా ఏకంగా 65 కోట్ల OTT ఆఫర్ దక్కడంతో నిర్మాతలు హ్యాప్పీ గా సినిమాను అమ్మేశారు, ప్రస్తుతం అద్బుతమైన ఫాం లో ఉన్న యంగ్ హీరో ఆయుష్ మాన్ ఖురానా సినిమాలకు హిట్ టాక్ వస్తే అవలీలగా 120 కోట్ల నుండి 150 కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకోగలడు…

   

అయినా కానీ థియేటర్స్ తెరిచే వరకు ఎదురు చూడకుండా డైరెక్ట్ గా భారీ ఆఫర్ రావడం తో అమ్మేశారు అంటే సినిమాలో మ్యాటర్ తక్కువగా ఉందా అన్న అనుమానాలు రేకేత్తగా ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ ని ఎంతవరకు అలరించగలిగిందో తెలుసు కుందాం పదండీ..

ముందుగా కథ పాయింట్ కి వస్తే…పురాతన ఫాతిమా మహాల్ కోసం తనకన్నా 15 ఏళ్ల పెద్ద అయిన బేగంని పెళ్లి చేసుకుంటాడు అమితాబ్… బేగం కూడా ఇది వరకే పెళ్లి అయినా తన భర్త లండన్ రమ్మాన్నాడు అని, ఫాతిమా మహాల్ విడిచి వెళ్ళడం ఇష్టం లేక అమితాబ్ ని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటుంది.

అలా వారి జీవితం గడవగా ఇప్పుడు ఆ మహాల్ లో చాలా మంది అద్దెకు ఉన్నా ఎవ్వరూ సరిగ్గా అద్దె ఇవ్వరు, అందులో హీరో ఆయుష్మాన్ ఖురానా అస్సలు ఇవ్వకపోవడం తో అమితాబ్ కి ఆయుష్మాన్ కి అస్సలు పడదు. అనుకోకుండా జరిగిన ఒక సందర్బం వల్ల… ఈ మహాల్ గురించి ఆర్కియాలజీ వాళ్లకి తెలుస్తుంది.

తర్వాత మహాల్ ని దక్కించుకోవడానికి ఇటు అమితాబ్ అటు హీరో తమ తమ రేంజ్ లో పన్నాగాలు వేయగా… చివరికి ఏం జరిగింది అన్నది అసలు కథ. కానీ చివర్లో బేగం అందరికీ షాకింగ్ ట్విస్ట్ ఇస్తుంది, అదేంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

కథ సింపుల్ గా బాగానే ఉన్నా టోటల్ సినిమా మొత్తం ఒక మహాల్ చుట్టూ తిరగడం పాత్రలు అవే మళ్ళీ మళ్ళీ రిపీటివ్ గా వస్తు ఉండటం తో బోర్ కొట్టడం ఖాయం. ఫస్టాఫ్ వరకు కొంచం అక్కడక్కడా ఇంటరెస్టింగ్ గానే సాగినా సెకెండ్ ఆఫ్ మాత్రం బోర్ కొడుతుంది, ఇక క్లైమాక్స్ ఎలా ఉంటుందో అని ఎదురు చూస్తూ ఉండగా…

బేగం ఇచ్చే ట్విస్ట్ కొంచం కొత్తగా ఉన్నా, దీని కోసమా ఇంత సేపు సినిమా తీశారు అనిపిస్తుంది. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అమితాబ్ బచ్చన్ కుమ్మేశాడు. ఈ ఏజ్ లో కూడా ప్రాస్తెటిక్ మేకప్ తో తన నటనా హావభావాలు అద్బుతం అని చెప్పాలి. అందరూ హేట్ చేసేలా ప్రవర్తించే తన తీరు నిజంగా చేస్తుంది…

అమితాబ్ అన్నది ఆడియన్స్ మరిపించే విధంగా ఉంటుంది, ఇక హీరో ఆయుష్మాన్ ఖురానా చాలా సింపుల్ రోల్ చేశాడు, తానూ రీసెంట్ టైం లో చేసిన రోల్స్ లో చాలా సింపుల్ రోల్ ఇదే. మిగిలినవాళ్ళు పర్వాలేదు అనిపించగా… సంగీతం నేపధ్య సంగీతం పర్వాలేదు అనిపిస్తుంది.

ఇక డైరెక్షన్ పరంగా విక్కీ డోనార్, మద్రాస్, పీకు లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన సూజిత్ సర్కార్ వాటి రేంజ్ లో అయితే సినిమా తీయలేదు, చాలా సింపుల్ కథ ని కొన్ని ఆకట్టుకునే సీన్స్ తో తీసి సినిమా అనిపించుకున్నాడు. కొన్ని సీన్స్ మెప్పించినా చాలా వరకు సీన్స్ ఆడియన్స్ సహనానికి పరీక్ష పెడుతుంది.

మొత్తం మీద సినిమా కొన్ని హవాక్కులు చవాక్కులు తప్పితే పెద్దగా చెప్పుకోవాడానికి ఏమి లేదు, అందుకేనేమో థియేటర్స్ లో వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని ముందే తెలిసి మంచి డీల్ రాగానే అమ్మేశారు అనిపిస్తుంది సినిమా మొత్తం చూశాక.. ఓవరాల్ గా కొన్ని మంచి సీన్స్ కోసం 2 గంటలు భరించే టైం ఉంటే ఒకసారి చూడొచ్చు. మా రేటింగ్ 2.25/5…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here