Home న్యూస్ అనగనగా ఓ అతిధి రివ్యూ….ఏంటి సామి ఇది!!

అనగనగా ఓ అతిధి రివ్యూ….ఏంటి సామి ఇది!!

0
-advertisement-

ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం అన్నది కామనే, కన్నడలో సూపర్ హిట్ అయిన “ఆ కరాళ రాత్రి” అనే సినిమాను అఫీషియల్ గా తెలుగు లో రీమేక్ అవ్వగా చైతన్య కృష్ణ, పాయల్ రాజ్ పుత్ ల ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా రీసెంట్ గా ఆహా వీడియో లో డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ..

-advertisement-

-advertisement-

కథ పాయింట్ విషయానికి వస్తే ఒకప్పుడు బాగానే బ్రతికినా తర్వాత అప్పుల వలన తండ్రి తాగుడు వలన కష్టాలు పడుతున్న ఒక ఫ్యామిలీ లోకి అనుకోకుండా ఒక అనుకోని అతిధి వచ్చి ఒకరోజు షెల్టర్ అడుగుతాడు, తర్వాత ఎం జరిగింది అన్నది ఓవరాల్ గా సినిమా కథ పాయింట్.

-advertisement-

-advertisement-

-advertisement-

ఇక్కడ అసలు కథని రివీల్ చేయడం లేదు, అది రివీల్ అయితే సినిమా చూసి వేస్ట్… ఇక్కడ 2 రకాలుగా కథని మనం అర్ధం చేసుకోవచ్చు, ఒకటి పాజిటివ్ వే లో ఒకటి నెగటివ్ వే లో…. పాజిటివ్ వే లో చూస్తె కథ సింపుల్ అయినా క్లైమాక్స్ లో అందరూ తప్పు చేశారు అని తెలుస్తుంది.

-advertisement-

అది వివరించి ఎండ్ చేసిన విధానం మెప్పిస్తుంది… ఇక నెగటివ్ వే ఏంటంటే…. పాయల్ రాజ్ పుత్ కి చైతన్య కృష్ణ కి మధ్య రిలేషన్ తెలిసాక ఇలాంటి సినిమాలు సమాజం పై ఎలాంటి ప్రభావం చూపుతాయి అనిపించకమానదు… ఈ విషయంలో మాత్రం కచ్చితంగా తప్పు పట్టి తీరాల్సిందే అనిపిస్తుంది.

ఇవి పక్కకు పెట్టి పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పాయల్ రాజ్ పుత్ మొదటి సీన్ నుండి చివరి సీన్ వరకు తన పెర్ఫార్మెన్స్ తో దుమ్ము లేపింది. RX100 తర్వాత తన నుండి వచ్చిన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇదే అని చెప్పాలి. ఇక చైతన్య కృష్ణ కూడా మెప్పించగా తల్లి తండ్రుల రోల్స్ కూడా బాగున్నాయి.

ఇక చిన్న రోల్ చేసిన వేణు కూడా ఆకట్టుకోగా మిగిలిన రోల్స్ చాలా చిన్నవి, అందరూ ఉన్నంతలో ఆకట్టుకున్నారు. డైలాగ్స్ కొన్ని అడల్ట్ డైలాగ్స్ ఇబ్బంది పెట్టినా కొన్ని బాగున్నాయి….. మొదట్లో స్వామీజీ చెప్పిన డైలాగ్స్ కి సింక్ అయ్యేలా సెకెండ్ ఆఫ్ లో సీన్స్ ఉంటాయి… సంగీతం పర్వాలేదు అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం మెప్పిస్తుంది.

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా నీరసంగా అనిపిస్తుంది, అతి చిన్న స్టొరీ లైన్ ని గంటన్నర టైం మాత్రమే తీసుకున్నా సాగదీసినట్లు అనిపించింది. సినిమాటోగ్రఫీ అద్బుతంగా ఉండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పించాయి. ఇక డైరెక్షన్ పరంగా ఒరిజినల్ వర్షన్ ను డైరెక్ట్ చేసిన…

దయాళ్ పద్మనాభన్ తెలుగు వర్షన్ కూడా డైరెక్ట్ చేయగా ఒకటి రెండు సీన్స్ తప్పితే ఉన్నది ఉన్నట్లు తీశారు… కథ చెప్పడానికి అతి చిన్న స్టొరీనే అయినా పెర్ఫార్మెన్స్ తో నడిపించగా, క్లైమాక్స్ ట్విస్ట్ తర్వాత కంక్లూజన్ మెప్పించినా ముందు చెప్పినట్లు ఎవరు ఎలా తీసుకోవాలి అనుకుంటే అలా తీసుకోవచ్చు.

మొత్తం మీద క్లైమాక్స్ కోసం, పాయల్ రాజ్ పుత్ పెర్ఫార్మెన్స్ కోసం సినిమా చూడొచ్చు… కానీ సినిమా నరేషన్ ఫస్టాఫ్ వరకు టేక్ ఆఫ్ అవ్వడానికి చాలా టైం తీసుకున్నట్లు అనిపించగా సెకెండ్ ఆఫ్ కూడా సీన్స్ కొన్ని ఆసక్తిగా ఉన్నా ప్రీ క్లైమాక్స్ నుండే సినిమా జోరు అందుకుంటుంది…..సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 2.5 స్టార్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here