ఈ ఇయర్ మలయాళం లో ఫోరెన్సిక్ సినిమా తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన టొవినో థామస్ నటించిన లాస్ట్ హిట్ క్లాస్ మూవీ అండ్ ది ఆస్కార్ గోస్ టు సినిమాను ఆహా వీడియో వాళ్ళు తెలుగు డబ్బింగ్ రైట్స్ తీసుకుని డబ్ చేసి నేడు డైరెక్ట్ గా రిలీజ్ చేశారు. మరి సినిమా ఎలా ఉంది, తెలుగు ఆడియన్స్ ని మెప్పించే సత్తా ఉందో లేదో తెలుసుకుందాం పదండీ..
కథ పాయింట్ విషయానికి వస్తే సినిమా థియేటర్ పక్క నర్సింగ్ హోమ్ లో పుట్టిన హీరో కి చిన్నప్పటి నుండే సినిమాల మీద ఆసక్తి ఉంటుంది, అది పెరిగాక మరింత ఎక్కువ అవ్వగా ఎలాగైనా ఆస్కార్ రేంజ్ సినిమా తీయాలి అని తను నిజజీవితంలో ఫేస్ చేసిన…
అనేక ఇన్సిడెంట్స్ తో ఒక కథ రెడీ చేసుకోగా ఏ నిర్మాత కూడా ఆ సినిమాను నిర్మించడానికి ముందుకు రాక పొతే తన ఆస్తులు అమ్ముకుని హీరో ఆ సినిమాని నిర్మించగా తర్వాత ఆస్కార్ రేసులో సినిమాను నిలపడానికి హీరో ఎలాంటి కష్టాలు పడ్డాడు. ఫైనల్ గా ఆస్కార్ సాధించాడా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
సినిమా వాళ్ళ కష్టాల గురించి ఇప్పటికీ అనేక సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా అలాంటి కోవలోకి వచ్చే సినిమానే.. కానీ సినిమా ఆడియన్స్ హృదయాలకు టచ్ అవ్వాలని మంచి పెర్ఫార్మెన్స్ తో అందరూ మెప్పించినా కానీ కథనం చాలా స్లో గా ఉండటం… సీన్స్ రిపీటేడ్ గా అనిపించడం లాంటివి ఇబ్బంది పెడతాయి.
పాపం హీరో కి అన్నీ మంచి జరగాలి అని కోరుకునే ఇంటెన్స్ ని డైరెక్టర్ చూస్తున్న ఆడియన్స్ తో అనిపించేలా చేసినప్పటికీ అంత ఓపికతో చూసే వారికి తప్ప నార్మల్ ఆడియన్స్ మెప్పు పొందడం కొద్దిగా కష్టమే అనిపిస్తుంది సినిమా. టొవినో థామస్ ఆ పాత్రలో జీవించేశాడు అని చెప్పాలి.
సినిమా ఆసాంతం తన నటన అద్బుతంగా ఉంటుంది, మరో సీనియన్ నటుడు సలీం కుమార్ కూడా అద్బుతంగా నటించి మెప్పించగా మిగిలిన వాళ్ళు కూడా మెప్పించారు. సంగీతం బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా ఫీల్ కి తగ్గట్లు ఉండగా సినిమా లెంత్ 2 గంటలే ఉన్నా కానీ పెద్ద సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
సినిమా కొత్త రకం సినిమాలు ఇష్టపడే వారికి, హార్ట్ టచింగ్ మూవీస్ నచ్చే వారికి, క్లాస్ మూవీస్ ఇష్టపడే వారికి నచ్చుతాయి, అదే సమయం లో రొటీన్ మూవీస్, కమర్షియల్ ఎంటర్ టైనర్స్ చూసే వారికి మాత్రం సినిమా జస్ట్ ఓకే అనిపించే విధంగా అనిపించడం ఖాయం.
మొత్తం మీద సినిమా యాక్టర్స్ మంచి నటనకి, సినిమా వాళ్ళ కష్టాలు, సినిమాలు తీయడం ఎంత కష్టమో తెలియజేయడం లాంటి వాటి కోసం ఒకసారి సినిమాని చూడొచ్చు. సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 2.5 స్టార్స్… నరేషన్ కొంచం ఫాస్ట్ గా ఉంటె సినిమా మరింత బాగా మెప్పించి ఉండేది…