Home న్యూస్ బాలీవుడ్ హిస్టరీలో రికార్డ్ కొట్టిన యానిమల్…500 కోట్ల జాతర ఇది!!

బాలీవుడ్ హిస్టరీలో రికార్డ్ కొట్టిన యానిమల్…500 కోట్ల జాతర ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ లో ఏ సర్టిఫికేట్ ను సొంతం చేసుకున్న ఏ సినిమా కూడా సాధించని రికార్డ్ ను సొంతం చేసుకుంది రణబీర్ కపూర్(Ranbir Kapoor) నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్(Animal Movie)… రిలీజ్ అయిన రోజే ఎక్స్ లెంట్ పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా…

అద్బుతమైన కలెక్షన్స్ తో లాంగ్ రన్ ని ఎంజాయ్ చేసిన ఈ సినిమా ఏకంగా రిలీజ్ అయ్యి 5 వారాలను పూర్తి చేసుకున్నా కూడా ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేస్తూ ఇప్పటికీ కలెక్షన్స్ పరంగా జోరు చూపిస్తూ ఉండగా సినిమా రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర హిస్టరీలో నిలిచి పోయే విధంగా ఇప్పుడు…..

500 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపడం విశేషం. సినిమా బాలీవుడ్ హిస్టరీలో 500 కోట్ల మార్క్ ని దాటిన అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడ విశేషం ఏంటి అంటే ఏ సర్టిఫికేట్ తెచ్చుకుని ఈ మార్క్ ని అందుకున్న ఒకే ఒక్క సినిమా కాగా…

అదే టైంలో ఆల్ మోస్ట్ 3 గంటల 20 నిమిషాలకు పైగా రన్ టైంతో తెరకెక్కిన ఈ సినిమా షోల పరంగా ఇబ్బందులు ఫేస్ చేసినా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ని ఎంజాయ్ చేసి ఇలా 500 కోట్ల మార్క్ ని దాటడం నిజంగానే సెన్సేషన్ అని చెప్పాలి. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును పూర్తి చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here