Home న్యూస్ అంతరిక్షం Vs పడిపడిలేచే మనసు Vs మారి2 Vs KGF Vs జీరో…ఫైనల్ కౌంట్ ఎంతంటే??

అంతరిక్షం Vs పడిపడిలేచే మనసు Vs మారి2 Vs KGF Vs జీరో…ఫైనల్ కౌంట్ ఎంతంటే??

0

     ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు భారీ ఎత్తున సినిమాలు పోటెత్తబోతున్నాయి. మన రాష్ట్రాలలోనే రిలీజ్ అయ్యే సినిమాలను ఒకసారి గమనిస్తే రికార్డ్ లెవల్ లో ఇది వాకు రిలీజ్ అయిన పాత సినిమాలతో పాటు ఇప్పుడు కొత్త గా 5 కొత్త సినిమాలు రాబోతున్నాయి. ఆ సినిమా ల రెండు తెలుగు రాష్ట్రాలల టోటల్ థియేటర్స్ కౌంట్ ని ముందుగా ఒకసారి తెలుసుకుందాం పదండీ..తెలుగు రాష్ట్రాలలో టోటల్ గా 1650 కి పైగా థియేటర్స్ ఉన్నాయి…అందులో..ముందుగా..

పడిపడిలేచే మనసు: శర్వానంద్ సాయి పల్లవి ల కాంబినేషన్ లో హను రాఘవపూడి డైరెక్షన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ పడిపడిలేచే మనసు టోటల్ గా రెండు రాష్ట్రాలలో సుమారు 500 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం..

అంతరిక్షం: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి అదితి రావ్ హైదరి ల కాంబినేషన్ లో సంకల్ప్ డైరెక్షన్ లో వస్తున్న అంతరిక్షం మొత్తం మీద 400 వరకు థియేటర్స్ లో రెండు రాష్ట్రాలలో రిలీజ్ కాబోతుంది. ప్రయోగాత్మక సినిమా అయినా బాగానే థియేటర్స్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా.

KGF :కన్నడభారీబడ్జెట్మూవీ KGF తెలుగు లో కూడా భారీ గా రిలీజ్ కానుంది కానీ థియేటర్స్ చాలినన్ని ఈ సినిమా కి దొరకలేదనే చెప్పాలి. ఉన్నంతలో ఈ సినిమా సుమారు 200 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం అందుతుంది.

మారి2: ధనుష్ సాయి పల్లవి ల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ మారి 2 తెలుగు లో కూడా పర్వాలేదు అనిపించే థియేటర్స్ ని సొంతం చేసుకుంది. టోటల్ గా సినిమా 120 వరకు థియేటర్స్ లో ఇక్కడ రిలీజ్ కాబోతుందని అంటున్నారు.

జీరో: కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జీరో ఇక్కడ టోటల్ గా 150 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇది మరీ తక్కువ అనే చెప్పాలి కానీ ఉన్న పోటి లో థియేటర్స్ సంఖ్య అనుకున్న విధంగా దొరకడం కష్టమే అని చెప్పాలి.

 టోటల్ గా ఈ సినిమాలు మొత్తం కలిపి సుమారు 1370 వరకు థియేటర్స్ ని సొంతం చేసుకోగా రోబో 2 150 వరకు థియేటర్స్ లో మిగిలిన సినిమాలు మరో 150 వరకు థియేటర్స్ లో రన్ అవుతున్నాయి. మొత్తం మీద అన్ని థియేటర్స్ లో కొత్త సినిమాలు…

ఈ శుక్రవారం సందడి చేయడం కన్ఫాం అవ్వడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాల కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఆసక్తిగా మారింది. ఈ సినిమాల టాక్ ని బట్టి థియేటర్స్ కౌంట్ పెరగడమో తగ్గడమో జరుగుతుంది అని చెబుతున్నారు. ఇక కలెక్షన్స్ ఎలా వస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here