Home న్యూస్ నిశ్శబ్దం రివ్యూ….ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటేనా!!

నిశ్శబ్దం రివ్యూ….ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటేనా!!

0

లేడీ సూపర్ స్టార్ అనుష్క భాగమతి సినిమా తర్వాత ఆల్ మోస్ట్ రెండున్నర ఏళ్ల తర్వాత చేసిన సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది, నిశ్శబ్దం టైటిల్ తో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అనుకున్నా కరోనా వలన పోస్ట్ పోన్ లు అవుతూ చివరికి ఇప్పుడు డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ గా డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకుంది… సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ…

కథ పాయింట్ విషయానికి వస్తే మూగ అమ్మాయి అయినా పెయింటింగ్ అద్బుతంగా వేసే ప్రతిభ ఉన్న అనుష్క ని వాయిలిన్ ఎక్స్ పెర్ట్ ఆయన మాదవన్ ఇష్ట పడగా తర్వాత ఇద్దరూ ప్రేమించుకుని ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంటారు. కానీ ఎంగేజ్ మెంట్ అయిన 2 రోజులకే….

తన ఫ్రెండ్ శాలిని పాండే కనిపించకుండా పోతుంది, ఈ భాద లో ఉన్న అనుష్క ని మూడ్ చేంజ్ కోసం వేరే చోటికి తీసుకెళ్లగా… అక్కడ అనుష్క వేయాలనుకున్న ఒక ఆర్టుకు సంబంధించిన మెటీరియల్ కోసమని ఎన్నో ఏళ్ల కిందట ఓ జంట అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఓ భవంతికి తీసుకెళ్తాడు మాధవన్…

కానీ అనుకోకుండా మాధవన్ అక్కడ చనిపోతాడు, దానికి కారణం ఎవరు, శాలిని పాండే కనిపించకుండా ఉండటానికి రీజన్ ఏంటి… ఈ కేసు మిస్టరీ ని చేదించడానికి ఏజెంట్ అంజలి ఎం చేసింది లాంటి విశేషాలు అన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

పెర్ఫార్మెన్స్ పరంగా అనుష్క తన కళ్ళతోనే నటించి మెప్పించగా తన ఇతర మూవీస్ తో పోల్చితే ఈ సినిమా కంప్లీట్ న్యూ మేక్ ఓవర్ అని చెప్పాలి… ఇక మిగిలిన నటీనటులు చాలామంది ఉన్నా ఎవ్వరికీ పెద్దగా నటించడానికి స్కోప్ లేకుండా పోయింది, మాదవన్ కొద్దిగా మెప్పించినా కానీ…

అంజలి, సుబ్బరాజ్, అవసరాల శ్రీనివాస్, శాలిని పాండే లాంటి తారాగణం గట్టిగా ఉన్నప్పటికీ కథలో దమ్ము లేకపోవడం తో వారు పెద్దగా ఏమి చేయలేక పోయారు. సంగీతం పర్వాలేదు అనిపించే విధంగా ఉండగా…

బ్యాగ్రౌండ్ స్కోర్ మెప్పించింది, డైలాగ్స్ పర్వాలేదు అనిపించే విధంగా ఉండగా స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ చాలా పూర్ గా ఉన్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉండగా డైరెక్షన్ చాలా వీక్ గా ఉందని చెప్పాలి, భారీ బడ్జెట్ తో థ్రిల్లర్ మూవీ తీసే చాన్స్ ఉన్నా…

రొటీన్ రివేంజ్ డ్రామా మారింది సినిమా, ఫస్టాఫ్ కథ లో ఇన్వాల్వ్ అవ్వడానికి చాలా టైం పట్టగా ఇంటర్వెల్ నుండి సెకెండ్ ఆఫ్ కొంచం పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నప్పటికీ ఓవరాల్ గా సినిమా 2 గంటల లోపే ఉన్నా కానీ…

ఏమాత్రం ఆసక్తిని కలిగించలేక పోయింది, సినిమా ఒక హర్రర్ మూవీ గా మొదలై తర్వాత థ్రిల్లర్ జానర్ లో కి ఎంటర్ అయ్యి ఫైనల్ గా సింపుల్ రివేంజ్ డ్రామా గా ఎండ్ అయ్యింది. ఇలాంటి సినిమా ని అసలు డైరెక్ట్ రిలీజ్ చేయం థియేటర్స్ లోనే చూడాల్సిన సినిమా అంటూ టీం తెగ డప్పు కొట్టారు కానీ…

ఈ 30 కోట్ల సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి అదే రేంజ్ లో బిజినెస్ చేసి ఉంటె బయ్యర్లకు, థియేటర్ ఓనర్లకి మైండ్ బ్లాంక్ అయ్యి ఉండేది అని చెప్పొచ్చు. మొత్తం మీద సినిమా అక్కడక్కడా కొన్ని మెరపులు ఉన్నా కానీ….

మొత్తం మీద సినిమా నిరాశ పరిచింది అనే చెప్పాలి, అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా సినిమా చూసిన నిరాశ చెందటం ఖాయం, అనుష్క పెర్ఫార్మెన్స్ కోసం కొన్ని సీన్స్ కోసం ఒకసారి కష్టపడి చూడొచ్చు… సినిమా మా ఫైనల్ రేటింగ్ 2 స్టార్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here